SRI KRISHNA JANMASTAMI ASTHANAM ON AUGUST 23_ ఆగ‌స్టు 23న తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి

Tirumala, 14 Aug. 19: In connection with Sri Krishna Janmastami, the temple court Asthanam will be observed on August 23 in Srivari temple at Tirumala.

The episode of Sri Krishna Jananam will be rendered at Bangaru Vakili between 7.30pm and 9.30pm on that day.

Later on August 24, Utlotsavam will be observed in Tirumala between 4pm and 8pm and TTD has cancelled all evening Arjitha Sevas in view of this fete on the day.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగ‌స్టు 23న తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి

తిరుమల, 2019 ఆగ‌స్టు 14: కలియుగ వైకుంఠమైన తిరుమలలో ఆగ‌స్టు 23న శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆగ‌స్టు 24న ఉట్లోత్సవం జ‌రుగ‌నున్నాయి.

శ్రీ వేంకటేశ్వరస్వామిని సాక్షాత్తు ద్వాపర యుగపురుషుడైన శ్రీకృష్ణునిగా సంస్మరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత ఆగ‌స్టు 23వ తేదీన‌ రాత్రి 7.30 గంటల నుండి 9.30 గంటల నడుమ శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీ కృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం ప్రభంద శాత్తుమొర, గోకులాష్టమి ఆస్థానం ఘనంగా చేప‌డ‌తారు.

కాగా ఆగ‌స్టు 24న తిరుమలలో ఉట్లోత్సవాన్ని సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉట్లోత్సవాన్ని తిలకించడానికి శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ తిలకిస్తారు. యువకులు ఎంతో ఉత్సాహంతో ఉట్లను కొడుతూ స్వామివార్లకు ఆనందాన్ని చేకూర్చుతారు.

ఈ ఉట్లోత్సవాన్ని పురస్కరించుకొని ఆగ‌స్టు 24వ తేదిన ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ వేడుకల్లో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.