SRI KT CLEANSED WITH PARIMALAM ON HOLY KOIL ALWAR_ శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 4 February 2018: In the famous temple of Sri Kapileswara Swamy in Tirupati, Koil Alwar tirumanjanam fete was performed on Sunday.

The entire temple including Vahanam, roofs and walls of sanctum Sanctorum, sub deities were cleansed with aromatic ingredients between 11.30am to 2pm.

Temple DyEO Sri Subramanyam and the temple officials took part int his fete. Meanwhile the annual brahmotsavams will commence on February 6 and conclude on Feb 15 with Nandi Vahana Seva on Feb 13 in this ancient and famous temple.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2018, ఫిబ్రవరి 04: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుంజనం ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 6 నుండి 15వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీ ఇ.జి.శంకరరాజు, సూపరింటెండెంట్‌ శ్రీరాజ్‌కుమార్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ నారాయణ, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 5న శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుపతిలోని శేషాచల పర్వతమూలంలో వెలసిన శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 6 నుండి 15వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో అంకురార్పణ కార్యక్రమం ఫిబ్రవరి 5న సోమవారం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 5.00 నుండి 7.00 గంటల వరకు మూషిక వాహనంపై శ్రీవినాయకస్వామివారి వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు అంకురార్పణ జరుగనుంది.

ఏర్పాట్లు పూర్తి :

బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతిరోజూ వాహనసేవల ముందు కళాబృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు, తిరిగి రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

ఫిబ్రవరి 6న ధ్వజారోహణం :

ఫిబ్రవరి 6వ తేదీ మంగళవారం ఉదయం 8.30 గంటలకు కుంభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.00 నుంచి 11.00 గంటల వరకు పల్లకి ఉత్సవం, రాత్రి 7.00 నుంచి రాత్రి 9.00 గంటల వరకు హంస వాహన సేవ జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం రాత్రి

06-02-2018(మంగళవారం) ధ్వజారోహణం(కుంభలగ్నం) హంస వాహనం

07-02-2018(బుధవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

08-02-2018(గురువారం) భూత వాహనం సింహ వాహనం

09-02-2018(శుక్రవారం) మకర వాహనం శేష(నాగ) వాహనం

10-02-2018(శనివారం) అధికారనంది వాహనం తిరుచ్చి ఉత్సవం

11-02-2018(ఆదివారం) వ్యాఘ్ర వాహనం గజ వాహనం

12-02-2018(సోమవారం) కల్పవృక్ష వాహనం తిరుచ్చి ఉత్సవం

13-02-2018(మంగళవారం) మహాశివరాత్రి, రథోత్సవం(భోగితేరు) నందివాహనం

14-02-2018(బుధవారం) పురుషామృగవాహనం కల్యాణోత్సవం, అశ్వవాహనం

15-02-2018(గురువారం) శ్రీనటరాజస్వామివారి రావణాశూర వాహనం సూర్యప్రభ వాహనం ధ్వజావరోహణం

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.