SRI KT TEMPLE FETE _ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మ‌వారి అభ‌యం

TIRUPATI, 18 DECEMBER 2021: The annual teppotsavams in Sri Kapileswara Swamy temple has witnessed the Koluvu of Sri Kamakshi Ammavaru in Ekantam on Saturday.

 

Later Unjal Seva was performed.

 

DyEO Sri Subramanyam, AEO Sri Satre Naik, Superintendent Sri Bhupati and others were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మ‌వారి అభ‌యం

 తిరుపతి, 2021 డిసెంబరు 18: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఏకాంతంగా జ‌రుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శ‌నివారం సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మ‌వారికి కొలువు నిర్వ‌హించారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజ‌ల్ మండ‌పంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సందర్భంగా వేద‌పండితులు వేద పారాయ‌ణం, టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు ఆలపించారు.

అదేవిధంగా ఆదివారం శ్రీ చండికేశ్వరస్వామివారు మ‌రియు శ్రీ చంద్రశేఖర స్వామివారికి కొలువు నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్రమణ్యం, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ రెడ్డిశేఖ‌ర్, ఆల‌య అర్చ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.