శ్రీకపిలేశ్వరాలయంలో ముగిసిన తెప్పోత్సవాలు
శ్రీకపిలేశ్వరాలయంలో ముగిసిన తెప్పోత్సవాలు
తిరుపతి, 01, జనవరి 2018 ; తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఐదు రోజుల పాటు జరిగిన తెప్పోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు శ్రీచండికేశ్వరస్వామివారు, శ్రీచంద్రశేఖర స్వామివారు తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తెప్పోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీ వినాయకస్వామివారు, రెండవ రోజు శ్రీ సుబ్రమణ్య స్వామివారు, మూడవ రోజు శ్రీ సోమస్కందస్వామివారు, నాలుగో రోజు శ్రీ కామాక్షి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
కాగా, జనవరి 2వ తేదీన ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం 5.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీ మాణిక్యవాసగ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.