SRI LAKSHMI SRINIVASA MAHA DHANWANTARI YAGAM COMMENCES _ ప్ర‌పంచ ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం శ్రీ లక్ష్మీశ్రీనివాస మహాధన్వంతరీ యాగం

TIRUMALA, 04 APRIL 2022: Sri Lakshmi Srinivasa Dhanwantari Maha Yagam commenced on a grand religious note at Dharmagiri Veda Vignana Peetham in Tirumala on Monday.

This three-day Yagam is mulled by TTD seeking world peace, health and prosperity.

Twelve ritwiks performed Yagakratuvu in Seven Homa Gundams.

This Maha Yagam is being aired live on SVBC between 11 am and 12 noon for the sake of global devotees till April 6.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

ప్ర‌పంచ ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం శ్రీ లక్ష్మీశ్రీనివాస మహాధన్వంతరీ యాగం

తిరుమ‌ల‌, 2022 ఏప్రిల్ 04: శ్రీ శుభ‌కృత్ నామ సంవ‌త్స‌రంలో శ్రీ‌వారి అనుగ్ర‌హంతో ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంద‌రూ ఆయురారోగ్యాల‌తో, సిరి సంప‌ద‌ల‌తో ఉండాల‌ని కోరుతూ తిరుమ‌లలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో మంగ‌ళ‌వారం శ్రీ లక్ష్మీశ్రీనివాస మహాధన్వంతరీ యాగం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. 12 మంది ప్ర‌ముఖ రుత్వికులతో మూడు రోజుల పాటు జ‌రుగ‌నుంది. మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి 12 గంటల వ‌ర‌కు ఎస్వీబీసీలో ఈ యాగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

యాగ‌శాల‌లో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని, శ్రీ ధ‌న్వంత‌రి, శ్రీ సుద‌ర్శ‌న భ‌గ‌వానుల ఉత్స‌వ‌మూర్తుల‌ను కొలువుదీర్చారు. ఏడు హోమగుండాల‌ను ఏర్పాటుచేశారు. ఈ సంద‌ర్భంగా ముందుగా విష్వ‌క్సేనారాధ‌న‌, పుణ్యాహ‌వ‌చ‌నం, రుత్విక్‌వ‌ర‌ణం, అగ్నిస్థాప‌న‌, అక‌ల్మ‌ష హోమం, శ్రీ ల‌క్ష్మీ విశేష మంత్ర‌హోమం, శ్రీ శ్రీ‌నివాస విశేష మంత్ర‌హోమం, శ్రీ ధ‌న్వంత‌రి మ‌హామంత్ర హోమం, శ్రీ సుద‌ర్శ‌న సంపుటీక‌ర‌ణ విశేష సూక్త హోమాలు నిర్వ‌హించారు. మూడు రోజుల పాటు ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 6.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు వైదిక కార్య‌క్ర‌మాలు జ‌రుగ‌నున్నాయి. ఏప్రిల్ 6వ తేదీ ఉద‌యం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల మ‌ధ్య‌ పూర్ణాహుతితో ఈ యాగం ముగియ‌నుంది.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.