LANKAN PM OFFERS PRAYERS IN TIRUMALA SHRINE _ శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని గౌ|| శ్రీ మహింద రాజపక్సే

Tirumala, 11 Feb. 20: The Honourable Prime Minister of Sri Lanka, Sri Mahinda Rajapaksa, accompanied by his cabinet minister Sri Arumugan Thondaman and his son Sri Yoshita Rajapaksa offered prayers in the hill shrine of Lord Venkateswara on Tuesday morning. 

 

The Foreign Dignitary reached Mahadwaram at 5:50am and was welcomed by AP Minister Sri P Ramachandra Reddy, EO Sri Anil Kumar Singhal and Additional EO Sri AV Dharma Reddy.  

EO also explained the VIP dignitary about the Retractable Roof laid atop from Padikavili to Dhwaja Mandapam to shield pilgrims from inclement weather conditions. 

Later the Sri Lankan Prime Minister had darshan of Lord along with his entourage during Astadala Pada Padmaradahana and VIP Break. 

After darshan, the Veda pundits offered Vedaseervachanam in Ranganayakula Mandapam to the Lankan Prime Minister.  He was later presented theertha prasadams. 

GRAND FAREWELL TO LANKAN PM

The Sri Lankan Prime Minister Sri Mahinda Rajapaksa was given a ceremonious farewell from Sri Padmavathi Rest House at Tirumala on Tuesday.

The foreign dignitary, earlier had darshan of Sri Venkateswara Swamy among with his entourage.

TTD EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy were present while bidding farewell to the top brass dignitary.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

 

శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని గౌ|| శ్రీ మహింద రాజపక్సే
 
ఫిబ్రవరి 11,  తిరుమల 2020: శ్రీలంక ప్రధాన మంత్రి గౌ|| శ్రీ మహింద రాజపక్సేే తన కుమారుడు శ్రీ యోషిత రాజపక్సే, ఆ దేశ మంత్రి శ్రీ ఆర్ముగన్ తొండమాన్ తో కలిసి మంగళవారం ఉద‌యం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
 
ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న శ్రీలంక ప్రధాని బృందానికి రాష్ట్ర మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి మ‌హ‌ద్వారం వ‌ద్ద సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. 
 
ఈ సందర్భంగా పడికావలి నుండి ధ్వజ మండపం వరకు భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా  ఏర్పాటు చేసిన కదిలే పైకప్పు గురించి గౌ. ప్రధానికి ఈఓ వివరించారు.
 
అనంతరం గౌ. శ్రీలంక ప్రధాని బృందం అష్టదళ పాదపద్మారాధన సేవలో, విఐపి బ్రేక్ లో శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
గౌ|| శ్రీలంక ప్రధాని బృందం శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ త‌రువాత టిటిడి ఈవో, జెఈవో క‌లిసి తీర్థప్రసాదాలు అందించారు.
 
శ్రీలంక ప్రధానికి ఘనంగా వీడ్కోలు
 
శ్రీలంక ప్రధాన మంత్రి గౌ|| శ్రీ మహింద రాజపక్సేేకు మంగళవారం ఉదయం తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్ద అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
 
అంతకుముందు గౌ. శ్రీలంక ప్రధాని బృందం శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
వీడ్కోలు పలికిన వారిలో ‌ టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి తదితరులు ఉన్నారు.
 
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.