SRI MAHALAKSHMI DEEPA PUJA IN KUPPAM ON OCTOBER 20 _ సనాతన ధర్మ పరిరక్షణకు మహాలక్ష్మీ దీపపూజ

Tirupati, October 17, 2026: TTD, in association with the Hindu Dharma Prachara Parishad and SVBC, will organise Sri Mahalakshmi Deepa Puja in Kuppam on October 20 to promote Sanatana Dharma and devotion, said TTD JEO Dr. A. Sarat.

The event will be held at the Deepotsavam venue near the tank bund on Vilajapuram Road. On Saturday evening, the JEO reviewed the arrangements with TTD, municipal and police officials.

He said the Deepa Puja aims to invoke the blessings of Goddess Mahalakshmi for prosperity, peace and well-being. The sacred lamp symbolises purity, knowledge and unity.

Comprehensive Arrangements for Devotees

The JEO directed officials to ensure adequate sheds, mats, lamps and puja materials, LED screens and drinking water facilities. He also instructed them to make arrangements for distributing buttermilk and Annaprasadam to devotees and to ensure close coordination among all departments.

TTD Board Member Sri Shantaram, VGO Sri Giridhar, engineering officials, SVBC representatives, and police and municipal officials participated in the review meeting.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

సనాతన ధర్మ పరిరక్షణకు మహాలక్ష్మీ దీపపూజ

అక్టోబరు 20న కుప్పంలో వైభవంగా నిర్వహణ

ఏర్పాట్లపై టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ సమీక్ష

తిరుపతి, 2026 అక్టోబరు 17: సనాతన ధర్మ పరిరక్షణ, భక్తిభావ వ్యాప్తి లక్ష్యంగా టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, ఎస్వీబీసీ సంయుక్తంగా అక్టోబరు 20న కుప్పంలో శ్రీ మహాలక్ష్మీ దీపపూజ నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ తెలిపారు.

కుప్పంలోని విలాజాపురం రోడ్డు, చెరువు కట్ట సమీపంలోని దీపోత్సవ ప్రాంగణంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమ ఏర్పాట్లపై శనివారం సాయంత్రం టీటీడీ, మున్సిపల్, పోలీసు అధికారులతో ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, మహాలక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో భక్తులకు సౌభాగ్యం, శాంతి, మంగళం కలగాలనే సంకల్పంతో దీపపూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీపం పవిత్రతకు, జ్ఞానానికి, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు.

భక్తులకు పటిష్ట ఏర్పాట్లు

దీపపూజకు వచ్చే భక్తుల కోసం షెడ్లు, మ్యాట్లు, దీపారాధన సామగ్రి, ఎల్‌ఈడీ స్క్రీన్లు, తాగునీరు తదితర సౌకర్యాలను సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు మజ్జిగ, అన్నప్రసాదం పంపిణీకి తగిన ఏర్పాట్లు చేయాలని, పోలీసు, మున్సిపల్, టీటీడీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సమీక్షలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతారం, విజీఓ శ్రీ గిరిధర్, ఇంజినీరింగ్ అధికారులు, ఎస్వీబీసీ ప్రతినిధులు, పోలీసు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది.