SRI MAHALAKSHMI DEEPOTSAVAM LIGHTS UP VISAKHAPATNAM BEACH _ విశాఖలో వైభవోపేతంగా శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవం

Tirupati / Visakhapatnam, November 27, 2026: Hundreds of women devotees joined a mass lamp-lighting ritual on Friday at the Sri Mahalakshmi Deepotsavam, held at MGM Park, Beach Road, Visakhapatnam. TTD organised the event along with the Hindu Dharmika Prachara Parishad (HDPP) and SVBC.

Thousands of lamps glowed along the shore as Vedic chants and Annamayya keertanas filled the air. Devotees prayed for prosperity, good health and the well-being of their families.

Priests first explained the significance of Deepa Puja. They then performed Vishvaksena Puja, Punyahavachanam, Deepalakshmi Aradhana, Deepalakshmi Ashtottara Satanamavali recitation and Kumkumarchana for Sri Chaturbhuja Mahalakshmi. Artistes of the Annamacharya Project sang devotional keertanas. Devotees then chanted the Deepa Mantram three times and offered Lakshmi Neerajanam, followed by Nakshatra Harathi and Kumbha Harathi.

SVBC telecast the event live. HDPP Secretary Dr. Medasani Mohan, CPRO Dr. T. Ravi, other officials and a large number of devotees took part.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

దీపకాంతులతో దివ్య సాగరతీరం

విశాఖలో వైభవోపేతంగా శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవం

•  వందలాది మహిళలతో సామూహిక దీపారాధన

•  వేదమంత్ర ఘోష, అన్నమయ్య సంకీర్తనామృతం, దీపలక్ష్మి ఆరాధన

•  వేలాది దీపాల కాంతులతో దేదీప్యమానమైన సాగర తీరం

తిరుపతి / విశాఖపట్నం, 2026 నవంబరు 27: సకల ఐశ్వర్య ప్రదాయిని శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి కృపాకటాక్షాలు సకల జనులపై ప్రసరించాలనే సంకల్పంతో, టీటీడీ ఆధ్వర్యంలో విశాఖపట్నం ఎంజీఎం పార్క్ బీచ్ రోడ్డులో శుక్రవారం శ్రీ మహాలక్ష్మీ దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

వందలాది మహిళా భక్తులు, పెద్ద సంఖ్యలో భక్తజనం ఒకే చోట చేరి భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించి, అమ్మవారికి సామూహిక దీపారాధన చేశారు. వేలాది దీపాల కాంతులు, వేదమంత్రాల ప్రతిధ్వనులు, అన్నమయ్య సంకీర్తనల మాధుర్యంతో సాగర తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ (హెచ్‌డీపీపీ), శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) సంయుక్తంగా ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ఐశ్వర్యం, సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం దీపపూజ

దీపం జ్ఞానానికి, పవిత్రతకు, శుభానికి ప్రతీక. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని దీపాలతో ఆరాధిస్తే ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని భక్తుల విశ్వాసం. కుటుంబ సంక్షేమం, సంతాన శ్రేయస్సు, సౌభాగ్యం కోసం మహిళలు అపార భక్తితో దీపపూజలో పాల్గొన్నారు.

సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా భక్తిభావాన్ని, ధార్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు సనాతన ధర్మ సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు టీటీడీ విశేష కృషి చేస్తోంది.

శాస్త్రోక్తంగా దీపలక్ష్మి ఆరాధన

అర్చకులు ముందుగా శ్రీ మహాలక్ష్మీ దీపపూజ ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. అనంతరం శ్రీ చతుర్భుజ మహాలక్ష్మీ అమ్మవారికి శాస్త్రోక్తంగా ఈ క్రింది పూజలు నిర్వహించారు:

•  విష్వక్సేన పూజ

•  పుణ్యాహవచనం

•  దీపలక్ష్మి ఆరాధన

•  దీపలక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం

•  కుంకుమార్చన

అన్నమయ్య సంకీర్తనలతో భక్తిపారవశ్యం

అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన సంకీర్తనలు భక్తులను పరవశింపజేశాయి. అనంతరం అర్చకులు భక్తులతో మూడుసార్లు దీపమంత్రాన్ని పఠింపజేసి, సామూహికంగా అమ్మవారికి లక్ష్మీ నీరాజనం సమర్పించారు.

వేల దీపాల వెలుగులో దివ్యదర్శనం

భక్తులంతా ఒకేసారి దీపాలు వెలిగించడంతో పూజా ప్రాంగణం వేలాది జ్యోతులతో దేదీప్యమానంగా ప్రకాశించింది. అనంతరం నక్షత్రహారతి, కుంభహారతి సమర్పించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి కుటుంబంలో సిరిసంపదలు, ఆరోగ్యం, ఆనందం, సుఖశాంతులు వెల్లివిరియాలని భక్తులు ప్రార్థించారు.

ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

ఈ కార్యక్రమంలో హెచ్‌డీపీపీ కార్యదర్శి డా. మేడసాని మోహన్, సీపీఆర్ఓ డాక్టర్ టి. రవి, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.