SRI MALAYAPPA RIDES FAVOURITE GARUDA VAHANA _ గ‌రుడ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప క‌టాక్షం

Tirumala, 20 Oct 20: On the fifth day of Srivari Navaratri Brahmotsavam Tuesday Sri Malayappa blessed devotees on Garuda vahanam.CJ of High Court Sri Justice Jitendra Kumar Maheswari was present at Vahana Seva.

In view of Covid-19 restrictions the utsava idol of Sri Malayappa Swamy mounted atop the bejewelled golden Garuda Vahanam was held in ekantham within the temple complex.

The speciality of this event is that the utsava idol is adorned with very rare and precious jewels like Makarakanti, Saligrama haram and Lakshmi haram worn by Mula Virat, whose history is rooted deep in the temple legends.

Legends say that Garuda or the Eagle is the main and daily vehicle of Lord Vishnu.As the Key watcher of  happenings around  Lord Vishnu, Garuda  also supervises  the course of the entire Srivari Brahmotsavam. Garuda functions as a servant, friend, life supporter, insignia,and flag of lord Venkateswara’s vehicle.

Garuda Seva is prominent in 108 countries around the globe including the Asian and South Asian countries and even widely watched with great reverence even in the countries like Myanmar, Malaysia and Indonesia.

Tirumala Pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar swamy,TTD EO Dr KS Jawahar Reddy, Parliament member Sri Vemireddi Prabhakar Reddy, Additional EO Sri AV Dharma Reddy, Board members Smt Vemi Reddy Prashanti Reddy, Dr Nischita, Sri DP Anantha, Sri Kumar Guru, Sri Ramesh Shetty, Sri Chippagiri Prasad, Sri Govind Hari, Sri Shiv Kumar, Sri Murali Krishna, Sri Bhaskar Rao, Sri Puta Pratap Reddy, Sri Shiva Sankaran, Sri Damodar Rao, Sri Partha Saradi Reddy, Urban SP Sri Ramesh Reddy, CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Ramesh Reddy, Temple, DyEO Sri Harindranath,Peshkar Sri Jaganmohan Charyulu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు

గ‌రుడ వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప క‌టాక్షం

తిరుమ‌ల‌, 2020 అక్టోబరు 20: శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగ‌ళ‌‌‌వారం రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు త‌న‌కు ఎంతో ప్రీతిపాత్ర‌మైన గ‌రుడ వాహ‌నంపై ద‌ర్శ‌న‌మిచ్చారు. హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి శ్రీ జితేంద్ర‌కుమార్ మ‌హేశ్వ‌రి ఈ వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు.

గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియచెప్పుతున్నారు.

కాగా, బ్ర‌హ్మోత్స‌వాల్లో ఆరో రోజైన బుధ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు హ‌నుమంత వాహ‌నం, మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు పుష్ప‌క విమానం, రాత్రి 7 గంట‌ల‌కు గ‌జ వాహ‌న‌సేవ‌ జ‌రుగ‌నున్నాయి.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, పార్ల‌మెంటు స‌భ్యులు శ్రీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో(ఆరోగ్యం మ‌రియు విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, బోర్డు స‌భ్యులు శ్రీ రామేశ్వ‌ర‌రావు, శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, శ్రీ ముర‌ళీకృష్ణ‌, డా. నిశ్చిత‌, శ్రీ జి.వి.భాస్క‌ర్‌రావు, శ్రీ పుత్తా ప్ర‌తాప‌రెడ్డి, శ్రీ శివ‌కుమార్‌, శ్రీ శివ‌శంక‌ర‌న్‌, శ్రీ‌ గోవింద‌హ‌రి, శ్రీ డిపి.అనంత‌, శ్రీ కుమార‌గురు, శ్రీ ర‌మేష్‌‌ శెట్టి, శ్రీ సిహెచ్‌.ప్ర‌సాద్‌, శ్రీ దామోద‌ర్‌రావు, శ్రీ పార్థ‌సార‌ధిరెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, అర్బ‌న్ ఎస్పి శ్రీ ఎ.ర‌మేష్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్, పేష్కార్ శ్రీ జ‌గ‌న్‌మోహ‌నాచార్యులు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.