SRI MALAYAPPA SWAMY BLESSES DEVOTEES ON KALPAVRIKSHA VAHANAM _ కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీ మలయప్పస్వామి కటాక్షం

DEVOTIONAL FERVOUR FILLS TIRUMALA WITH BHAJANS AND KOLATAMS

Tirumala, October 15, 2026: On the fourth day of the Navaratri Brahmotsavams, Sri Malayappa Swamy, along with His consorts, blessed devotees on the Kalpavriksha Vahanam in the Bakasura Vadha alankaram on Thursday morning.

The procession was marked by majestic elephants, auspicious music, devotional bhajans, kolatams and Divya Prabandham recitations by Jeeyangars. Devotees offered camphor harati and sought the blessings of the Lord.

The Kalpavriksha, regarded in Hindu tradition as the divine wish-fulfilling tree, symbolises prosperity and the fulfilment of devotees’ aspirations.

Evening Vahanam: Sri Malayappa Swamy will bless devotees on the Sarvabhoopala Vahanam from 7 pm to 9 pm on Thursday.

TTD Chairman Sri B.R. Naidu, Executive Officer Sri Muddada Ravichandra, Additional EO Sri C.H. Venkaiah Chowdary, district officials, Board members and other dignitaries participated in the event.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో శ్రీ మలయప్పస్వామి కటాక్షం

భక్తిభావంతో పరవశించిన తిరుమల.. భజనలు, కోలాటాలతో ఆధ్యాత్మిక శోభ

తిరుమల, అక్టోబరు 15, 2026: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి బకాసుర వధ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

గజరాజుల ముందు నడక, మంగళవాయిద్యాల నాదం, భక్తబృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ప్రబంధ పారాయణం నడుమ వాహనసేవ వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారి కృపాకటాక్షాలు పొందారు.

కల్పవృక్ష వాహనం – కోరిన కోర్కెలు తీర్చే దివ్య వైభవం

క్షీరసాగర మథనంలో ఉద్భవించిన కల్పవృక్షం కోరిన ఫలాలను ప్రసాదించే దివ్య వృక్షంగా పురాణాలు పేర్కొంటాయి. అటువంటి కల్పవృక్ష వాహనంపై స్వామివారు దర్శనమివ్వడం భక్తులకు ఐహిక శుభాలు, సకలాభీష్టాల ప్రాప్తికి ప్రతీకగా నిలుస్తుంది.

రాత్రి సర్వభూపాల వాహనసేవ

గురువారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, జేఈఓ (విద్యా, ఆరోగ్యం) శ్రీ గోపీనాథ్, సీవీఎస్‌వో శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.