SRI PARTHASARATHY SWAMY AVATAR ON SRI GT TEPPOTSAVAM_ తెప్పపై శ్రీపార్థసారథిస్వామివారి అవతారంలో శ్రీగోవిందరాజస్వామి

Tirupati, 26 January 2018: On Day 2 of the Annual Teppotsavam at Sri Govindaraja Swamy Temple, the presiding deity took avatar of Sri Parthasarathy swamy along with his consorts and gave darshan to devotees on the float in the evening 6.30pm to 8pm and later on Mada streets.

As per agama traditions of the festival the float will go round in the pushkarini for five times and give darshan to devotees who throng the temple for celestial festival.

On Saturday the deity will take avatar on Sri Kalyana Venkateswara Swamy on the floats procession. The artists of the HDPP and Annamaharya project rendered Bhajans, Harikatha and Bhakti sangeet during the festival.

Among other the Dy EO Smt P Varalakshmi, Supdt Suresh, Temple inspector Sri Krishnamurthy and other officials partiicipated in the event.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తెప్పపై శ్రీపార్థసారథిస్వామివారి అవతారంలో శ్రీగోవిందరాజస్వామి

తిరుపతి, 2018 జనవరి 26: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం స్వామివారు శ్రీపార్థసారథిస్వామివారి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం 6.30 నుండి 8.00 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై విహరించి భక్తులకు అభయమిస్తారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

స్వామివారు మొత్తం ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అదేవిధంగా శనివారం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి అవతారంలో స్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి పి.వరలక్ష్మి, సూపరింటెండెంట్‌ శ్రీ సురేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కృష్ణమూర్తి ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.