SRI PVT PAVITROTSAVAMS POSTERS RELEASED_ అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

Tirupati, 16 Sep. 19: TTD Joint Executive Officer, Sri P Basant Kumar on Monday released the wall posters of annual Pavitrotsavams at Sri Prasanna Venkateswara temple of Appalayagunta beginning from September 25-27 with Ankurarpanam on September 24.

The poster release event took place at his chambers in the TTD administrative building in which DyEO Smt Jhansi Rani, Agama advisor Sri Srinivasacharyulu, Archaka Sri Babuswami, Superintendent Sri Gopalakrishna Reddy participated.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాల గోడపత్రికలు ఆవిష్కరణ

సెప్టెంబర్ 16, తిరుపతి, 2019: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 25 నుండి 27వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాల గోడపత్రికలను తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ ఆవిష్కరించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో సోమ‌వారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

సెప్టెంబ‌రు 24న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు మేదినిపూజ‌, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు. సెప్టెంబ‌రు 25న ఉదయం స్న‌ప‌న తిరుమంజ‌నం, రాత్రి పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబ‌రు 26న ఉద‌యం స్న‌ప‌న తిరుమంజ‌నం, పవిత్ర సమర్పణ, సెప్టెంబ‌రు 27న ఉద‌యం స్న‌ప‌న తిరుమంజ‌నం, రాత్రి 7.30 నుండి 8 గంటల వరకు మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఝాన్సీరాణి, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ శ్రీ‌నివాసాచార్యులు, అర్చ‌కులు శ్రీ బాబుస్వామి, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల‌కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.