SRI RAMA NAVAMI ASTHANAM HELD _ శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం

HANUMANTHA VAHANA SEVA OBSERVED

 TIRUMALA, 10 APRIL 2022: TTD observed the religious event of ‘Sri Rama Navami Asthanam’ in the hill shrine of Sri Venkateswara at Tirumala on Sunday night with religious fervour.

On this important festival day, the processional deity decked as Sri Venkatadri Ramudu was taken along the four Mada streets on Hanumantha Vahanam.

Additional EO Sri AV Dharma Reddy, temple DyEO Sri Ramesh Babu, VGO Sri Bali Reddy also participated.

 ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి ఆస్థానం

హనుమంతునిపై శ్రీ వేంకటాద్రిరాముడు

తిరుమల, 2022 ఏప్రిల్ 10: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకొని రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీరాములవారు తన భక్తుడైన హనుమంతునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.

హ‌నుమంత వాహ‌నం – భ‌గ‌వ‌త్ భ‌క్తి ప్రాప్తి

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి తిరువీధులలో దర్శనమివ్వడం భక్తులను ఆనందపరవశులను చేసింది. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయుడు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

శ్రీరామనవమి ఆస్థానం

అనంతరం రాత్రి 10 నుండి 11 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.