SRI RAMA PATTABHISHEKAM OBSERVED _ శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

TIRUPATI, 01 APRIL 2023: Sri Rama Pattabhisheka Mahotsavam was observed with spiritual fervour in Sri Kodandarama Swamy temple in Tirupati on Saturday evening.

After Abhishekam to Mulavirat in the morning, special abhishekam was performed to utsava deities with sacred water brought from Narasimha Theertham.

Later in the evening, Pattabhisheka Mahotsavam was observed followed by a procession of deities on Tiruchi along four mada streets encircling the ancient shrine.

Deputy EO Smt Nagaratna, AEO Sri Mohan, Superintendent Sri Ramesh Kumar and other staffs, devotees were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

తిరుపతి, 2023 ఏప్రిల్‌ 01: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఉత్సవమూర్తులను ఊంజల్‌మండపానికి వేంచేపు చేశారు. అనంతరం నరసింహతీర్థం నుండి తెచ్చిన తీర్థంతో శ్రీకోదండరామునికి అభిషేకం చేశారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్ట, చతుర్దశ కలశస్నపన తిరుమంజనం నిర్వహించారు.

రాత్రి 7 గంటల నుండి శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీఆంజనేయస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ మోహన్, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్ కుమార్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.