SRI RAMA ENTHRALLS ON BLISSFUL TREE CARRIER _ కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం
TIRUPATI, 23 MARCH 2023: As part of the ongoing annual Brahmotsavam of Sri Kodandaramaswamy in Tirupati, the Kalpavriksha vahana seva took place on Thursday accompanied by Sita Devi and Lakshmana Swamy.
Pontiffs of Tirumala, Sri Sri Pedda Jeeyar and Sri Sri Sri Chinna Jeeyar Swamis, Temple Deputy EO Smt Nagaratna, AEO Sri Mohan, Kankanabhattar Sri Anandakumar Dixitulu, Superintendent Sri Ramesh, Temple Inspectors Sri Suresh, Sri Chalapati and a large number of devotees participated in Vahanaseva.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కల్పవృక్ష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం
తిరుపతి, 2023 మార్చి 23: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు గురువారం ఉదయం కల్పవృక్ష వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రకృతికి శోభను సమకూర్చేది చెట్టు. అనేక విధాలైన వృక్షాలు సృష్టిలో ఉన్నాయి. అందులో మేటి కల్పవృక్షం. కల్పవృక్షం వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని స్వామివారు అధిరోహించారు.
అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిచారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, కొబ్బరినీళ్లు, చందనంలతో అభిషేకం చేశారు.
వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ మోహన్, కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ సురేష్, శ్రీ చలపతి, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.