SRI RAMA SHINES ON SARVABHOOPALA _ సర్వభూపాల వాహనంపై జగదభిరాముని అభయం
TIRUPATI, 02 APRIL 2022:Sri Kodanda Rama Swamy shined on Sarvabhoopala Vahanam on the fourth day evening of the ongoing annual Brahmotsavams in Tirupati on Saturday evening.
Both the senior and Junior Pontiffs of Tirumala, Spl. Gr. DyEO Smt Parvati, and others were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సర్వభూపాల వాహనంపై జగదభిరాముని అభయం
తిరుపతి, 2022 ఏప్రిల్ 02: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవ రాత్రి 10 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా జరుగనుంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సర్వభూపాలురు అంటే అందరు రాజులు అని అర్థం. ”రాజా ప్రజారంజనాత్” అన్నట్లు ప్రజలను రంజింపజేసేవారే రాజులు. ఈ రాజులందరికీ రాజాధిరాజు భగవంతుడు.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి పార్వతి, ఏఈవో శ్రీ దుర్గరాజు, కంకణబట్టార్ శ్రీ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ శ్రీ రమేష్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునిరత్నం, శ్రీ జయకుమార్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.