SRI RAMACHANDRA SHINES ON GAJA VAHANAM _ గజ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం
Vontimitta, 26 April 2021: On Monday night, the sixth day of the ongoing annual Brahmotsavam celebrations, the utsava idols of Sri Sitarama were aloft the Gaja vahana at the Sri Kodandaramaswami temple, Vontimetta in YSR Kadapa district.
The traditional Vahana sevas was held in ekantham as per COVID guidelines after the spectacular fete of Sri Sitarama Kalyanam which significantly heralded the glory and dignity of Sri Rama in battlefield, royal court and also festivities.
TTD JEO Smt Sada Bhargavi, DyEO Sri Ramesh Babu, Temple AEO Sri Muralidhar, Superintendent Sri Venkateshaiah, Inspectors Sri Dhananjayulu, Sri Giribabu, archakas and other staff were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
గజ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి కటాక్షం
ఒంటిమిట్ట, 2021 ఏప్రిల్ 26: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం రాత్రి గజ వాహనంపై శ్రీ సీతారాములు దర్శనమిచ్చారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహనసేవ నిర్వహించారు.
కల్యాణం తరువాత సీతారాములు మాత్రమే విహరించే గజ వాహనానికి ఎంతో విశిష్టత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో కానీ, రాజదర్బారులో కానీ, ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం.
ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి, డిప్యూటి ఈవో శ్రీ రమేష్ బాబు, ఏఈవో శ్రీ మురళీధర్ , ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.