SRI RAMANUJA DIVYA PRABANDAMPARAYANAM HELD _ పెద్దజీయర్ మఠంలో శ్రీ రామానుజ నూట్రందాది దివ్యప్రబంధ పారాయణం

Tirumala, 18 Apr. 21: As part of the ongoing 1005th Avatara Mahotsavam of Sri Ramanujacharya, Sri Ramanuja Nutrandadi Divya Prabanda Parayanam was conducted on Sunday at the mutt of Sri Sri Sri Pedda Jeeyarswami.

The holy Parayanam conducted by TTD for the well-being and relief of humanity from pandemic COVID-19 was live telecasted on SVBC between 10am and 11 am.

Both the Senior and Junior Pontiffs of Tirumala, HDPP Secretary and Alwar Divya Prabandham Project Special Officer Acharya K. Rajagopalan were present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పెద్దజీయర్ మఠంలో శ్రీ రామానుజ నూట్రందాది దివ్యప్రబంధ పారాయణం

తిరుమల, 2021 ఏప్రిల్ 18: శ్రీ రామానుజాచార్యుల వారి 1005వ అవతార మహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ పెద్దజీయర్ మఠంలో ఆదివారం శ్రీ రామానుజ నూట్రందాది దివ్యప్రబంధ పారాయణం నిర్వహించారు. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఉదయం 10 నుండి 11 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

ప్రపంచ మానవాళికి కరోనా ముప్పు తొలగించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ పారాయణ కార్యక్రమం నిర్వహించారు.

శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, వారి శిష్యబృందం, హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి మరియు ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.రాజగోపాలన్‌ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.