SRI RAMANUJACHARYA AVATARA MAHOTSAVAM COMMENCES _ శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ప్రారంభం
Tirupati, 10 May 2023: HH Sri Sri Sri Chinnajiyar Swami of Tirumala emphasized that Bhagavad Sri Ramanujacharya preached Almighty belongs to everyone.
Under the auspices of TTD Alwar Divya Prabandha Project, the Avatarotsavam of Sri Ramanujacharya started grandly on Friday evening at Annamacharya Kalamandiram in Tirupati.
The festival will be held for three days till May 12.
On this occasion, Sri Chinnajeyar Swami in his Anugraha Bhashana said that Bhagavad Ramanuja was believed to be the incarnation of Adisesha and specially propagated that devotion is the only way to attain divinity.
Later, scholar Dr Chakravarty Ranganathan of Tirupati gave a lecture on “Glory of Sri Ramanuja”.
After that the devotees were impressed by the Sankeertans sung by the Annamacharya project artist Smt. Revathi and team.
Alwar Divya Prabandha Project Co-ordinator Sri Purushottam and locals participated in this program.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
భగవంతుడు అందరివాడన్న రామానుజాచార్యులు : టీటీడీ తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి
– శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2024 మే 10: భగవంతుడు అందరివాడని భగవద్ రామానుజాచార్యులు ఉద్బోధించారని, ప్రస్తుత సమాజంలో అందరూ దీన్ని పాటించాలని టిటిడి తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి ఉద్ఘాటించారు. టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 12వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.
ఈ సందర్భంగా టిటిడి తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ ఆదిశేషుని అవతారమైన భగవద్ రామానుజులు శరణాగత భక్తిని విశేషంగా ప్రచారం చేశారని, శరణాగతి భక్తితో భగవంతుని కొలిస్తే దివ్యత్వం కలుగుతుందని అన్నారు. శ్రీమహావిష్ణువుకు ఆదిశేషుడు పాన్పుగా, ఆసనంగా ఉంటూ ప్రథమ సేవకుడిగా నిలిచాడని, భగవద్ రామానుజులు ఈ మార్గాన్నే అనుసరించారని వివరించారు. శ్రీ రామానుజార్యుల అవతార మహోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోందన్నారు.
అనంతరం తిరుపతికి చెందిన ఆచార్య చక్రవర్తి రంగనాథన్ “శ్రీ రామానుజ వైభవం”పై ఉపన్యసించారు. ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి రేవతి బృందం ఆలపించిన సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ శ్రీ పురుషోత్తం, పురప్రజలు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.