SRI SITA RAMA ALANKARA SANGEETA KALYANOTSAVAM HELD IN VASANTA MANDAPAM _ వసంత మండపంలో వేడుకగా శ్రీ సీతారామ అలంకార సంగీత కల్యాణం

Tirumala, 18 September 2021: On the occasion of the closing ceremony of Sodasadina Balakanda Parayanam at Vasantha Mandapam, Sri Sita Rama Alankara Sangeetha Kalyanam held with religious ecstasy on Saturday evening.

The artistes from Annamacharya Project rendered Adivo Alladivo, Sri Sita Ramula Kalyanamu, Adaro Paadaro, Nela Moodu Sobhanalu, Sita Kalyana Vaibhogame, Choodaramma Satulala, Pidiketi Talambrala, Ksheerabdi Kanyakaku Sankeertans and Govinda Namalu with melody.

The settings arranged in Vasanta Mandapam to match the occasion stood as a special attraction. The Utsava Murthies of Sri Sita Rama were seated opposite each other and celestial Kalyanam performed amidst chanting of vedic hymns as per Hindu traditional wedding.

Chief priests of Tirumala temple Sri Venugopala Deekshitulu, Sri Krishna Seshachala Deekshitulu, scholar Sri Prava Ramakrishna and others were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వసంత మండపంలో వేడుకగా శ్రీ సీతారామ అలంకార సంగీత కల్యాణం

తిరుమల, 2021 సెప్టెంబరు 18: తిరుమ‌ల‌లో షోడ‌శ‌దిన బాల‌కాండ పారాయ‌ణ దీక్ష ముగింపు సంద‌ర్భంగా శ‌నివారం రాత్రి వ‌సంత మండ‌పంలో శ్రీ సీతారామ అలంకార సంగీత క‌ల్యాణం వేడుకగా జ‌రిగింది. ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపక బృందం పలు సంకీర్తనలు ఆలపిస్తుండగా, వేదమంత్రాల నడుమ అర్చకస్వాములు కల్యాణ ఘట్టాన్ని జరిపించారు.

ఇందులో అదివో అల్లదివో శ్రీహరివాసము…, సీతారాముల కళ్యాణము చూతము రారండి…, ఆడరో పాడరో అప్సరోగణము…, నెల మూడు శోబనాలు నీకు నతనికే తగును…, సీతాకల్యాణ వైభోగమే | రామ కల్యాణ వైభోగమే…, చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ…, పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు కొంత…, క్షీరాబ్ది కన్యకకు.., కీర్తనలను, గోవింద నామాలను కీర్తనలను కళాకారులు ఆలపించారు.

ఈ సందర్భంగా వసంత మండపాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. శ్రీ సీతారాముల ఉత్సవర్లను ఎదురెదురుగా వేంచేపు చేశారు. కల్యాణ ఘట్టాలకు అనుగుణంగా సంగీత కళాకారులు కీర్తనలు ఆలపించారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణ శేషాచల దీక్షితులు, వేద‌పాఠ‌శాల ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని, ప్రవచనకర్త శ్రీ ప్రవా రామకృష్ణ శాస్త్రి, ఆల‌య ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.