SRI SOUMYANATHA SWAMY BLESSES DEVOTEES ON CHANDRAPRABHA VAHANAM _ చంద్రప్రభ వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీ సౌమ్యనాథ స్వామివారు
Tirupati, July 27, 2026: As part of the annual Brahmotsavams at Sri Soumyanatha Swamy Temple in Nandaluru, the Lord blessed devotees on Chandraprabha Vahanam on the sixth day, Monday night.
According to the Vedas, the Moon is the nourisher of medicinal herbs and a symbol of peace, coolness and bliss. Depicting this divine significance, Sri Soumyanatha Swamy was taken in a grand procession on Chandraprabha Vahanam, filling devotees with spiritual joy.
Temple Superintendent Sri Hanumanthaiah, Temple Inspector Sri Rajesh, priests, officials, staff and a large number of devotees participated in the Vahana Seva and received the Lord’s blessings.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
చంద్రప్రభ వాహనంపై భక్తులను కటాక్షించిన శ్రీ సౌమ్యనాథ స్వామివారు
తిరుపతి, 2026 జూలై 27: నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరవ రోజైన సోమవారం రాత్రి శ్రీ స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు.
చంద్రుడు ఔషధీశుడిగా, రసస్వరూపుడిగా సకల జీవరాశికి పోషకుడిగా వేదాలు వర్ణించాయి. ఔషధ సంపదను పరిరక్షిస్తూ, లోకానికి శాంతి, చల్లదనం, ఆనందాన్ని ప్రసాదించే చంద్రభగవానుని మహిమకు ప్రతీకగా శ్రీ సౌమ్యనాథస్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరించి భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తారు.
ఈ వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ రాజేష్, అర్చకులు, అధికారులు, సిబ్బంది, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.

