SRI SRINIVASA DIVYANUGRAHA HOMAM COMMENCES- శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్రారంభం

COLOURFUL PROCESSION HELD

HOMAM FOR THE BENEFIT OF HUMANITY- TTD CHAIRMAN

DEVOTEES PARTICIPATE WITH RELIGIOUS ECSTASY

DECORATIONS GALORE

Tirumala, 23 November 2023: On the auspicious day of Uttana Ekadasi in the sacred month of Karthika TTD commenced the significant Sri Srinivasa Divyanugraha Homam for the well-being of the entire humanity, advocated TTD Chairman Sri Bhumana Karunakara Reddy.

Speaking at Homa Vedika at Alipiri Go Mandiram on Thursday, the TTD Trust Board Chairman said TTD has been doing a lot of religious programs since several decades and began yet another significant ritual for the well-being of devotees in the name of Sri Srinivasa Divyanugraha Visesha Homam.

He said this ritual has an important place in Hindu Dharmic scriptures invoking the blessings of Lord Agni with Venkateswara Sankalpam. Adding further he said it is not a single-day event but lasts till the existence of Universal Supremo Sri Venkateswara Swamy

“Usually performing Homam individually is expensive for many and with this Homam the devotees who aspire to perform Homam shall participate in an economic way. Even before we gave wide publicity towards this unique Homam, the tickets in online are booked till December “, he maintained.

The TTD Board Chief said very soon a permanent Homa Vedika will be built with the contribution of a donor so that 400-500 devotees can participate in different time slots in an uninterrupted manner. The devotees can select the date of their choice or on their special days. The only motto of TTD is beget the divine blessings of Sri Venkateswara Swamy to devotees, he reiterated.

Devotional Cultural Treat

Earlier a colourful procession of various artistes displaying portraying various deities led from SV Vedic University to Homa Vedika amidst Veda Ghosha by Vedic students.

Devotees jubilant

Meanwhile devotees who participated in the Homam on its maiden expressed immense satisfaction and thanked TTD Chairman and the EO for rolling out the unique idea in the larger interests of devotees.

Decorations

On the other hand the floral, pandal and electrical illuminations enhanced the glory and grandeur of the Homa Vedika in a befitting manner.

The utsava murthies of Sri Srinivasa with Sridevi and Bhudevi were seated on a special platform and Homam was performed with utmost devotion by vedic pundits of SV Vedic University.

The Honourable Minister Smt Roja, TTD EO Sri AV Dharma Reddy, board members Sri Deshpande, Dr Tippe Swamy, Sri Yanadaiah, Sri Subbaraju, Sri Venkata Satish, LAC chief of Chennai Sri Sekhar Reddy, JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, SVVU Vice Chancellor Acharya Rani Sadasiva Murthy, DLO Sri Veeraju were also present.

Among other elite and officials, TMC Mayor Dr Sirisha, Deputy Mayors Sri Abhinay Reddy, Sri Mudra Narayana, TMC Commissioner Smt Harita, SVIMS Director Sri RV Kumar and others also participated.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

టీటీడీ ఆధ్వర్యంలో మరిన్ని భక్తి చైతన్య కార్యక్రమాలు

– శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్రారంభం

– టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి

తిరుమల, 23 నవంబర్ 2023: లోక కళ్యాణార్థం భవిష్యత్తులో టీటీడీ మరిన్ని భక్తి చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అలిపిరి సమీపంలోని సప్త గో ప్రదక్షిణ మందిరంలో గురువారం ఉదయం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో చైర్మన్ దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, తరతరాలుగా సనాతన హైందవ సంస్కృతిలో హోమానికి విశేష ప్రాధాన్యత ఉందన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీవారి పాదపద్మముల వద్ద ఈ హోమ కార్యక్రమాన్ని శాశ్వతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల కోరికలను భగవంతునికి చేర్చే ఒక బృహత్తర కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టిందన్నారు. ఎంతో ఖర్చు, శ్రమ తో కూడిన హోమ కార్యక్రమాన్ని భక్తుల కోసం తక్కువ ఖర్చుతో ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.

సప్త గో ప్రదక్షిణ మందిరం నందు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన హోమ వేదిక వద్ద ప్రతిరోజు 100 మంది గృహస్తులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆన్లైన్లో డిసెంబర్ 31వ తేదీ వరకు హోమం టికెట్లు బుక్ అయ్యాయని తెలిపారు. భక్తులు వర్చువల్ గా కూడా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు. దాత సహకారంతో త్వరలో దాదాపు 500 మంది గృహస్తులు కూర్చుని ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనేలా వేదికను నిర్మించనున్నట్లు చైర్మన్ తెలిపారు.

భక్తులకు సులభతరంగా శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు, భక్తుల చెంతకు భగవంతుణ్ణి తీసుకువెళ్లాలనే సంకల్పంతో టీటీడీ శ్రీనివాస కళ్యాణాలు, వైభవోత్సవాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, భజన బృందాల ఏర్పాటు, అన్నమాచార్య సంకీర్తనలు భక్త లోకానికి అందించడం, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం స్థాపన లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు చైర్మన్ వివరించారు.

ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ, భగవంతుని ఆరాధించే అనేక పద్ధతుల్లో హోమ కార్యక్రమం అత్యంత ప్రాసస్యమైందని తెలిపారు. హోమం చేయడం, గానం చేయడం ద్వారా భగవంతుని త్వరగా చేరుకోవచ్చన్నారు.

శోభాయ మానంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ ప్రారంభోత్సవ ఊరేగింపు :

ఎస్వీ వేద విశ్వవిద్యాలయం నుండి గురువారం ఉదయం 7 గంటలకుశ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్రారంభోత్సవ ఊరేగింపు నిర్వహించారు. టీటీడీ చైర్మన్ శ్రీ కరుణాకర రెడ్డి , ఈవో. శ్రీ ఎవి ధర్మారెడ్డి పాల్గొన్నారు.

వేద విద్యార్థులు, అధ్యాపకులు, భజన మండళ్ల కళాకారులు ఊరేగింపుగా సప్తగో ప్రదక్షిణ మందిరంకు చేరుకున్నారు.

ఈ హోమ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీమతి రోజా , మేయర్ డాక్టర్ శిరీష, టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు శ్రీ తిప్పే స్వామి, శ్రి సుబ్బరాజు, శ్రీ దేశ పాండే , శ్రీ యనాదయ్య, శ్రీ సతీష్ కుమార్, శ్రీ శేఖర్ రెడ్డి , జేఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం దంపతులు, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి హరిత, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ బాలాజి, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ శ్రీ భూమన అభినయ రెడ్డి దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.