SRI THULASI DHATRI SAHITA DAMODAR PUJA AT VASANTHA MANDAPAM _ వ‌సంత మండ‌పంలో ఆగ‌మోక్తంగా శ్రీ తులసి ధాత్రి స‌హిత దామోద‌ర పూజ‌

Tirumala,5,November,2022 : TTD grandly organised the Sri Tulasi Dhatri Sahita Damodar puja at Vasantha mandapam as part of festivities of Vishnu puja during Karthika masa on Saturday.

The spectacular event was telecast live on SVBC after the utsava idols of Sri Malayappa Swami and his consorts were brought to Vasantha mandapam and seated along with idols f Lakshmi Narayana and Tulasi and Usiri plants.

TTD vaikhanasa agama adviser Sri Mohana Rangacharyulu highlighted the significance of the  Sri Tulasi Dhatri Sahita Damodar puja during Karthika Masam.

Srivari temple chief archaka  Sri Venugopal Dikshitulu, Sri Govindaraja Dikshitulu and other officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వ‌సంత మండ‌పంలో ఆగ‌మోక్తంగా శ్రీ తులసి ధాత్రి స‌హిత దామోద‌ర పూజ‌

తిరుమల‌, 2022 నవంబరు 05: కార్తీక మాసంలో టిటిడి త‌లపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా క్షీరాబ్ది ద్వాద‌శిని పుర‌స్క‌రించుకుని శ‌నివారం తిరుమ‌ల వ‌సంత మండ‌పంలో శ్రీ తులసి ధాత్రి స‌హిత దామోద‌ర పూజ‌ ఘనంగా జరిగింది. మ‌ధ్యాహ్నం 3 నుండి 4 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన ఈ పూజా కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసింది.

ముందుగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని వ‌సంత మండ‌పానికి వేంచేపు చేశారు. ఎదురుగా ల‌క్ష్మీ, నారాయ‌ణుల ప్ర‌తిమ‌ల‌ను, తుల‌సి, ఉసిరి వృక్షాల‌ను కొలువుదీర్చారు. ఈ సంద‌ర్భంగా వైఖానస ఆగ‌మ స‌ల‌హాదారులు శ్రీ మోహ‌న రంగాచార్యులు మాట్లాడుతూ శ్రీ తుల‌సీ ధాత్రి స‌హిత దామోద‌ర పూజ విశిష్ట‌త‌ను తెలియ‌జేశారు. కార్తీక మాసంలో ఈ పూజ చేయ‌డం వ‌ల్ల పితృదేవ‌త‌లు విష్ణుసాన్నిధ్యాన్ని చేరుతార‌ని, కోటి జ‌న్మ‌ల పుణ్య‌ల ల‌భిస్తుంద‌ని చెప్పారు. తుల‌సిని పూజిస్తే గ్ర‌హ‌బాధ‌లు తొల‌గుతాయ‌ని, స‌క‌ల ఐశ్వ‌ర్యాలు చేకూరుతాయ‌ని వివ‌రించారు.

అనంత‌రం కార్తీక విష్ణుపూజా సంక‌ల్పం, బ్ర‌హ్మాది దేవ‌త‌ల‌కు ఆరాధ‌న చేశారు. ఈ సంద‌ర్భంగా పండితులు కృష్ణ అష్టోత్త‌ర శ‌త‌నామావ‌ళిని పారాయ‌ణం చేశారు. నివేద‌న‌, క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ఈ పూజ ముగిసింది.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ గోవింద‌రాజ దీక్షితులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.