SRI THYAGARAJA JAYANTHI _ త్యాగరాజ కీర్తనలతో పులకించిన తిరుమలగిరులు

Tirumala, 21 April 2018: The Kalyana Vedika on the papavinasam road reverberated to the melodious sankeertanas of carnatic saint-singer Sri Thyagaraja sung by hundreds of exponents on the ocassion of his 251th Jayanthi utsava celebrations .

The pancha ratna kirtanas of Sri Thyagaraya,divyanama sankeertans and other festival mode kirtanas of Tirumala were rendered in open chorus of 400 including the classical exponents from AIR,Doordarshan,SVBC Nada Niranjanam,HDPP, Annamayya Project and SV Music and Dance college teachers.

The event a feast for lovers of carnatic and classic music was broadcast live by the SVBC channel.

In the program chaired by SV Music college principal Smt YVS Padmavati , TTD all projects OSD Sri Mukteswar Rao,TTD asthana singer Sri Garimella Balakrishna Prasad, and instrument artistes from AP, Telangana, Tamil Nadu, Karnataka and Odisha performed


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI

త్యాగరాజ కీర్తనలతో పులకించిన తిరుమలగిరులు

ఏప్రిల్‌ 21, తిరుమల 2018సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి 251వ జయంతి ఉత్సవం సందర్భంగా కళాకారులు ఆలపించిన కీర్తనలతో తిరుమలగిరులు పులకించాయి. తిరుమలలోని పాపవినాశనం మార్గంలో గల కల్యాణవేదిక ప్రాంగణంలో టిటిడి ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో వాగ్గేయకార వైభవం కార్యక్రమంలో భాగంగా శ్రీ త్యాగరాజస్వామివారి జయంతి ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.

సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ త్యాగరాజస్వామివారి పంచరత్న కృతులు, ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, దివ్యనామ సంకీర్తనలను కళాకారులు ఆలపించారు. ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ కర్ణాటక సంగీత విద్వాంసులు, ఆకాశవాణి, దూరదర్శన్‌ టాప్‌గ్రేడ్‌ కళాకారులు, శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ, ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, స్థానిక, స్థానికేతర కళాకారులు కలిసి దాదాపు 350 మంది పాల్గొని రసరమ్యంగా కీర్తనలను ఆలపించడంతో తిరుమలగిరులు మారుమోగాయి.

”జగదానందకారక…., దుడుకు గల నన్నేదొర…, సాధించెనే….., కనకరుచిరా…., ఎందరో మహానుభావులు….., తెర తీయగ రాదా…. ” తదితర కీర్తనలను కళాకారులు రాగ భావ యుక్తంగా ఆలపించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేసింది.

ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీమతి వై.వి.ఎస్‌.పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టిటిడి పూర్వ ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం, ఎస్వీబీసీ ఇన్‌చార్జి సిఈవో శ్రీఎన్‌.ముక్తేశ్వరరావు, ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ పుల్లెల పేరిసోమయాజులు, శ్రీమతి ఎన్‌.విజయలక్ష్మి, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుండి గాత్రం, వీణ, వయోలిన్‌, వేణువు, డోలు, నాదస్వరం కళాకారులు, ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.