SRI VARAHASWAMY JAYANTI ON AUGUST 30 IN TIRUMALA _ ఆగస్టు 30న శ్రీ వరాహస్వామి జయంతి
Tirumala, 21, August ,2022: TTD is organizing the Sri Varaha swamy Jayanti at Tirumala on August 30.
As part of the festivities in the morning Kalash sthapana, Kalash puja, Punya havachanam will be performed ahead of Panchamruta Abhisekamto the Mula idol of Sri Varaha Swamy.
TTD grandly conducted the Sri Varahaswami Jayanti celebrations at Tirumala annually as per local puranam the first puja is always rendered to Sri Varahaswami ahead of Sri Venkateswara. It is also a common practice to seek darshan and blessings of Sri Varaha Swamy ahead of Sri Venkateswara.
Puranic legends also speak of Sri Vishnu incarnation as Sri Varaha Swamy to kill evil Hiranyaksha and save Sri Bhudevi.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు 30న శ్రీ వరాహస్వామి జయంతి
తిరుమల, 2022 ఆగస్టు 21: ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో ఆగస్టు 30న వరాహ జయంతి జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేస్తారు. ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారుచేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు.
కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో అగమ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీవరాహస్వామి జయంతిని టిటిడి ఘనంగా నిర్వహిస్తోంది. స్థలమహత్యం ప్రకారం తిరుమలలో తొలి పూజ, తొలి నివేదన శ్రీ వరాహస్వామివారికే చేస్తారు. భక్తులు ముందుగా శ్రీభూవరాహస్వామివారిని, ఆ తరువాత శ్రీవారిని దర్శించుకోవడం ఆచారం. శ్రీ మహావిష్ణువు లోక కల్యాణం కోసం శ్రీ వరాహస్వామివారి అవతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.