SRI VENKATESWARA TEMPLE OPENS UP AT KANYAKUMARI_ కన్యాకుమారిలో వైభవంగా శ్రీవారి ఆలయ మహాకుంభాభిషేకం

Kanyakumari, 27 January 2019: The doors of Sri Venkateswara Swamy temple opened up for the darshanam of devotees on Sunday who have been eagerly waiting since long time after Maha Kumbhabhishekam ceremony in the auspicious Kumbha Lagnam between 7.30am and 9am.

Speaking on this celestial occasion, TTD EO Sri Anil Kumar Singhal said, the construction of temple in the famous pilgrim centre of Kanya kumari was mulled five years ago. “The construction works at Rs.22.50crores picked up from the past two and a half years and today the temple was opened in a grandeur way”, he maintained.

The EO also briefed the media about the various other development activities which are in offing in Tamilnadu including the construction of Sri Padmavathi Devi temple at Chennai with an estimated Rs.5.75crores. “We have also approached Tamil Nadu Government to grant 5 to 10 acres of land to construct Sri Venkateswara Swamy temple”, he said.

As per the instructions of Honourable CM of AP whose wish is to construct Sri Venkateswara Divyakshetrams at many places, we have been in touch with Chief Secretaries of all states. The temple which was opened at Kurukshetra is witnessing good number of devotees turnout. Very soon we are going open up Srivari temple at Hyderabad in Telengana”, he added.

Apart from these activities, we have been presenting silk vastrams to many ancient temples in Tamilnadu as a tradition. Out of 10lakh odd sevakulu who have rendered service so far in Srivari seva, over 1.80lakhs are from Tamilnadu only, he added.

TTD Joint Executive Officer Sri Pola Bhaskar, TTD Board Members Sri Sri Krishna, Sri Peddi Reddy, Sri Rudraraju Padma Raju, TTD Chief Vigilance and Security Officer Sri Gopinath Jetti, TTD Officials and large number of took part.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

కన్యాకుమారిలో వైభవంగా శ్రీవారి ఆలయ మహాకుంభాభిషేకం

ఆలయ నిర్మాణానికి సహకరించిన తమిళనాడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు : టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

జనవరి 27, కన్యాకుమారి 2019: కన్యాకుమారిలోని వివేకానందపురంలో నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాకుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించామని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. కన్యాకుమారిలో ఆదివారం ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య కుంభ లగ్నంలో మహాకుంభాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టితో కలిసి ఈవో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ రూ.22.50 కోట్ల వ్యయం ఆలయ నిర్మాణం చేపట్టామని, ఇందుకు సహకరించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయంలో జనవరి 22న అంకురార్పణతో వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని, 21 మంది రుత్వికులు ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు. తమిళనాడు నుండి వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తున్నారని, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో రూ.34.60 కోట్లతో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో 2018, జూలై 1వ తేదీ నుండి భక్తులకు దర్శనం కల్పిస్తున్నామన్నారు. తమిళనాడులోని పలు ప్రముఖ ఆలయాల్లో విశేష పర్వదినాల సందర్భంగా టిటిడి తరఫున వస్త్ర సమర్పణ చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. తిరుమలలో ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామివారి ఆలయం నుండి పట్టువస్త్రాలు, తిరుమల శ్రీవారి బ్రహ్మూెత్సవాల నాలుగో రోజున శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీనాచ్చియార్‌(ఆండాళ్‌) దేవస్థానం నుండి పూలమాలలు, చిలుకలను సమర్పిస్తున్నారని తెలియజేశారు.

ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ద్వారా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆళ్వార్లు, ఆచార్యపురుషుల ధార్మిక సందేశాలను సదస్సులు, పుస్తకాల ద్వారా ప్రచారం చేస్తున్నామని, నాళాయిర దివ్యప్రబంధ పారాయణ పథకంలో తమిళనాడులో 163 మంది పండితులకు వయసులవారీగా నెలకు రూ.8 వేలు, రూ.5 వేలు, రూ.4 వేలు పెన్షన్‌ అందిస్తున్నామని ఈవో తెలిపారు. టిటిడిలో 2000వ సంవత్సరంలో ప్రారంభమైన శ్రీవారి సేవ విభాగంలో తమిళనాడు రాష్ట్రం నుండి ఇప్పటివరకు 1.77 లక్షల మంది శ్రీవారి సేవకులు సేవలందించారని వెల్లడించారు. తమిళనాడు నుండి దాససాహిత్య ప్రాజెక్టు ద్వారా 5 వేల మంది భజన మండళ్ల సభ్యులు, హిందూ ధర్మప్రచార పరిషత్‌ ద్వారా 330 మంది భజనమండళ్ల సభ్యులు ఉన్నారని చెప్పారు. తమిళనాడు భక్తుల కోసం రాజపాళెం, నైవేలి, హోసూరు ప్రాంతాలో టిటిడి కల్యాణమండపాలున్నాయని, వాటిలో ఆధునిక వసతులు కల్పిస్తున్నామని తెలియజేశారు.

చెన్నైలోని టి.నగర్‌ జిఎన్‌.చెట్టి వీధిలో రూ.5.75 కోట్లతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తున్నట్టు ఈవో వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్‌, కన్యాకుమారి, కురుక్షేత్రలో ఆలయాల నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇదే క్రమంలో చెన్నైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. వేలూరులోని శ్రీ వేంకటేశ్వర హయ్యర్‌ సెకండరీ స్కూల్లో 1,050 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఈ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.7.5 కోట్లు కేటాయించామన్నారు. కోల్‌కతాలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, యాత్రాస్థలాలు, 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి, శ్రీ రుద్రరాజు పద్మరాజు, ప్రత్యేక ఆహ్వానితులు, చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు శ్రీ శ్రీకృష్ణ, ఎస్‌ఇ శ్రీ రాములు, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్‌) శ్రీ వేంకటేశ్వర్లు, డిఇ శ్రీ రవిశంకర్‌రెడ్డి, ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి, విఎస్‌వోలు శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, శ్రీ ప్రభాకర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.