SRI VINOD KUMAR G AGRAWAL SWORN IN AS TTD BOARD EX-OFFICIO _ తితిదే ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ వినోద్‌కుమార్ ప్రమాణస్వీకారం
తితిదే ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ వినోద్‌కుమార్ ప్రమాణస్వీకారం
తిరుమల, 09 జూలై 2013 : తిరుమల శ్రీవారి ఆలయంలో తితిదే ధర్మకర్తల మండలి ఎక్స్ ఆఫిసియో సభ్యులుగా రాష్ట్ర దేవాదాయశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ వినోద్‌కుమార్ జి. అగ్రావాల్ మంగళవారం నాడు ప్రమాణ స్వీకారం చేసారు.
శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత ఉ.10.30 గంటలకు శ్రీ వినోద్‌కుమార్ గారిచే తి.తి.దే ఇఓ శ్రీ ఎం.జి.గోపాల్ ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు. అటు తరువాత రంగనాయకుల మండపంలో వైదికులు వేదాశీర్వచనం చేసారు. ఆనంతరం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.జి.గోపాల్, పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం, ఆధ్యాత్మిక పుస్తకాలు అందజేసారు.
ఆలయం వెలుపల శ్రీ వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారు కల్పించిన ఈ మహా అవకాశాన్ని భక్తుల సేవలో వినియోగించుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో జె.ఇ.ఓ.లు శ్రీ శ్రీనివాసరాజు, శ్రీ వెంకట్రామిరెడ్డి, సి.వి.ఎస్.ఓ. శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, ఎ.సి.వి.ఎస్.ఓ. శ్రీ శివకుమార్‌రెడ్డి, డిప్యూటి ఇఓ శ్రీ చిన్నంగారి రమణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.