SRIMAN NYAYASUDHA PARAYANAM AT SRIVARI TEMPLE_ జూలై 10 నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీమాన్‌ న్యాయసుధ పారాయణం

Tirumala, 7 Jul. 19: As part of annual Sri Jayathirtha Aradhanaotsavam from July 10-14 and July 18-22 the TTDs Dasa Sahitya Project plans to organise Sriman Nyayasudha Parayanams at Srivari temple.

Elaborate arrangements were being made to conduct the event in the platform opposite to the Vimana Venkateswara spot in the Srivari temple twice a day from 6-10 am and again 3-6 pm.

Nyayasudha is a conceptual document, one of 37, created by devotee Sri Jayathirtha, disciple Of Dvaita sidhanta founder Sri Madhvacharya, recital of which is predicted to beget rainfall and prosperity.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 10 నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీమాన్‌ న్యాయసుధ పారాయణం

తిరుమల, 2019 జూలై 07: శ్రీ జయతీర్థుల ఆరాధనోత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 10 నుంచి 14వ తేదీ వరకు, తిరిగి జూలై 18 నుంచి 22వ తేదీ వరకు శ్రీమాన్‌ న్యాయసుధ పారాయణం జరుగనుంది. టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

శ్రీవారి ఆలయంలోని విమాన వేంకటేశ్వరస్వామివారికి ఎదురుగా వేదపారాయణదారులు న్యాయసుధను పారాయణం చేస్తారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఈ పారాయణం జరుగుతుంది.

ద్వైతసిద్ధాంత ప్రతిష్టాపనాచార్యులైన శ్రీ మధ్వాచార్యులు ఆసేతు హిమాచలం సంచరించి శిష్యులకు సత్‌ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ 37 గ్రంథాలకు పైగా రచించారు. శ్రీవారి భక్తుడైన శ్రీ జయతీర్థులవారు పూర్వజన్మలో వృషభరూపంలో శ్రీ మధ్వాచార్యుల సన్నిధిలో ఉంటూ ద్వైత సిద్ధాంతభావాన్ని పూర్తిగా శ్రవణం చేసిన ప్రభావంతో తరువాత జన్మలో ఈ గ్రంథాలకు ‘న్యాయసుధ’ పేరుతో వ్యాఖ్యాన గ్రంథాన్ని రచించి ప్రసిద్ధి పొందారు. వీరి సాహిత్యాన్ని శ్రీపురందరదాసుగ్రహించి వేల కీర్తనలు రచించారు. ‘న్యాయసుధ’ గ్రంథాన్ని పారాయణం చేయడం వల్ల వర్షాలు బాగా కురిసి దేశం సుభిక్షంగా ఉంటుందని, ప్రపంచశాంతి చేకూరుతుందని భక్తుల విశ్వాసం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.