మార్చి 7 నుంచి 15 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు
మార్చి 7 నుంచి 15 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు
తిరుపతి, 2019 మార్చి 06: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్చి 7వ తేదీ నుంచి 26వ తేదీ వరకు చిత్తూరు, అనంతపుం, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 15 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.
చిత్తూరు జిల్లా..
– మార్చి 7వ తేదీన వాల్మీకిపురం మండలం భరణిపల్లి హరిజనవాడలో గల శ్రీ రామాలయంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం జరుగనుంది.
– మార్చి 8న పీలేరులోని బాపూజీ య.సి, యస్.టి. కాలనీలో గల శ్రీ రామలయంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది.
– మార్చి 9న సదుం మండలం తాటిగుంటపల్లి హరిజనవాడలో గల శ్రీ రామాలయంలో గల శ్రీ కోదండరామాలయంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
అనంతపురం జిల్లా..
– మార్చి 14న తనకల్లు మండలం రేకుంఠపల్లి గ్రామంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
– మార్చి 15న నల్లచెరువు మండలం చెరువాండ్లపల్లి గ్రామంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది.
– మార్చి 16న కదిరి మండలం మల్లయ్యగారిపల్లి తాండలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
– మార్చి 17న యల్లనూరు మండలం సింగవరం గ్రామంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది.
– మార్చి 18న పుట్లూరు మండలం గురుగుచింట్లపల్లి గ్రామంలోని తుంబురుకోన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
– మార్చి 19న నరపాల మండలం సిద్దలచర్ల గ్రామంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా..
– మార్చి 21న మహబూబ్‌నగర్ హౌసింగ్‌బోర్డు కాలనీలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
– మార్చి 22న తిమ్మాజీపేట మండలం నారేళ్ళపల్లి గ్రామంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
– మార్చి 23న నార్వ మండలం నాగల్‌కద్‌మూరు గ్రామంలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం జరుగనుంది.
– మార్చి 24న మక్తల్ మండలం మక్తల్ హరిజనవాడలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు.
– మార్చి 25న బాలనగర్ మండలం చెన్నివెల్లిలో సాయంత్రం 6.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది.
– మార్చి 26న ఫరుక్‌నగర్ మండలం జనంపేట గ్రామంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు తితిదే రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.