SRINIVASA KALYANAM ON NOV 16 IN MYSORE_ నవంబరు 16న మైసూర్‌లో శ్రీనివాసకల్యాణం

Tirupati, 13 November 2017: The divine marriage of the deities, Srinivasa Kalyanam is performed in Mysore in the state of Karnataka on November 16.

This celestial event takes place in the kalyana mandapam located in Periya Patna Taluk under the aegis of Kalyanotsavam Project of TTD.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నవంబరు 16న మైసూర్‌లో శ్రీనివాసకల్యాణం

నవంబరు 13, తిరుపతి, 2017: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో నవంబరు 16వ తేదీన కర్ణాటక రాష్ట్రం మైసూరులోని పెరియపట్న తాలూక స్టేడియంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు చేస్తాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.