మార్చి 26 నుండి 5 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు

మార్చి 26 నుండి 5 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు

మార్చి 08, తిరుపతి, 2018: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్చి 26 నుంచి 30వ తేదీ వరకు అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో కలిపి మొత్తం 5 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.

– మార్చి 26వ తేదీన అనంతపురం జిల్లా ఆగలి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.

– మార్చి 27న కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని పెంటికోట గ్రామంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– మార్చి 28న కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం సోమిరెడ్డిపల్లిలోని ఎపి రెసిడెన్షియల్‌ పాఠశాల ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

– మార్చి 29న కడప జిల్లా మైదుకూరు మండలం బసవాపురం ఎస్‌సి కాలనీలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.

– మార్చి 30న కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం జి.వి.పురం ఎస్‌సి కాలనీలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణాలు వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణాలు కనువిందు కానున్నాయి. శ్రీవారి కల్యాణోత్సవాల సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.