జూలై 2 నుంచి 9వ తేదీ వరకు కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలలో శ్రీనివాస కల్యాణాలు

జూలై 2 నుంచి 9వ తేదీ వరకు కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలలో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, 2018 జూన్‌ 30: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో జూలై 2 నుంచి 9వ తేది వరకు కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలలోని 8 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. అన్నిచోట్లా సాయంత్రం 6 గంటలకు కల్యాణాలు ప్రారంభంకానున్నాయి.

కృష్ణా జిల్లాలో….

– జూలై 2వ తేదీన జగ్గయ్యపేట మండలం, తక్కిల్లపాడు గ్రామంలోని శ్రీ రాములవారి ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– జూలై 3న చంద్రర్లపాడు మండల కేంద్రంలోని ఎస్‌.సి.కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

– జూలై 4న నందిగామ మండల కేంద్రంలోని డివిఆర్‌ కాలనీలో ఉన్న శ్రీ రాములవారి ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– జూలై 5న చాట్రై మండలం, పొత్తనపల్లి గ్రామంలోని శ్రీ రాములవారి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– జూలై 6న పెదపరుపుడి మండలం, యలమూరు గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో …..

– జూలైన 7న గార మండల కేంద్రంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– జూలై 8న రేగిడి మండలం, రేగిడి ఆముదాల వలస గ్రామంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– జూలై 9న శ్రీకాకుళం మండల కేంద్రంలోని పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.