SRINIVASA KALYANAM HELD AT SV TEMPLE IN HYDERABAD

Hyderabad, 13 Mar. 19: The divine wedding of Utsava Murthies of Sri Venkateswara Swamy with Sridevi and Bhudevi was held in a grand manier at Sri Venkateswara temple in Jubilee Hills at Hyderabad on Wednesday evening.

The celestial marriage was held beter en 4pm and 5.30pm. The archana commenced the cele stil fete with Punyahavachanam followed by Ankuraropanam, Rakshabandhanam, Kankanadharana, Agni pratishta, Maha Sankalpam, Varanamayiram, Neeraajanam and concluded with Harati.

TTD local advisory committee chairman SRI B Ashok Reddy, members SRI P Ramakrishna,Sri Balraj Goud, Sri DKrishna Mohan ,Sri Trinath babu,Sri Rami Reddy,SE SRI A Ramulu ,DyEO SRI P Vishwanatham,AEO SRI Jaganmohan Raju and Scores of devotees took part in this fete.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

నూత‌న శ్రీ‌వారి ఆల‌యంలో వైభ‌వంగా శ్రీ‌నివాస క‌ల్యాణం

హైద‌రాబాద్‌, 13 మార్చి 2019: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం సాయంత్రం వైభ‌వంగా శ్రీ‌నివాస క‌ల్యాణం జ‌రిగింది. ఆల‌యంలో ఉద‌యం మహాకుంభాభిషేకం అనంత‌రం సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు భక్తులకు స‌ర్వ‌దర్శనం క‌ల్పించారు. సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం నిర్వ‌హించారు. శ్రీ‌నివాస క‌ల్యాణాన్ని వీక్షించిన భ‌క్తులు భ‌క్తిసాగ‌రంలో మునిగితేలారు. భ‌క్తుల గోవింద‌నామ‌స్మ‌ర‌ణ‌తో ఆల‌య ప‌రిస‌రాలు మారుమోగాయి.

శ్రీ‌నివాస క‌ల్యాణంలో భాగంగా విష్వ‌క్సేనారాధ‌న‌, పుణ్యాహ‌వ‌చ‌నం, అంకురారోప‌ణ‌, ర‌క్షాబంధ‌నం – కంక‌ణ‌ధార‌ణ‌, అగ్నిప్ర‌తిష్ట‌, మ‌ధుప‌ర్కం, మ‌హాసంక‌ల్పం – గోత్ర‌నామాలు చెప్పుకోవ‌డం, క‌న్యాదానం, మాంగ‌ళ్య‌ధార‌ణ‌, హోమాలు, పూల‌మాల‌లు మార్చుకోవ‌డం, అక్ష‌తారోప‌ణం, నీరాజనం ఘ‌ట్టాల‌ను శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా టిటిడి అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు ఆయా ఘ‌ట్టాల‌కు అనుగుణంగా అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను ర‌స‌ర‌మ్యంగా ఆల‌పించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ బి.అశోక్‌రెడ్డి, సభ్యులు శ్రీ పి.రామకృష్ణ, శ్రీపి.బాలరాజు గౌడ్‌, శ్రీ డి.కృష్ణమోహన్‌, శ్రీ వై.త్రినాథ్‌బాబు, శ్రీ రామిరెడ్డి, ఎస్‌ఇ శ్రీ ఎ.రాములు, డెప్యూటీ ఈవో శ్రీ పి.విశ్వనాథం, ఏఈవో శ్రీ జగన్‌మోహన్‌రాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.