SRINIVASA KALYANAM HELD IN SRIKAKULAM_ శ్రీకాకుళంలో వైభవంగా శ్రీనివాస కల్యాణం

Tirupati, 9 July 2018: The month long Dharma Ratha Yatra came to an end in the district of Srikakulam with the grand conduct of Srinivasa Kalyanam on Monday evening.

The Dharma Ratha Yatra by Hindu Dharma Prachara Parishad(HDPP) wing of TTD commenced on June 9 and covered 400 villages in this district.

Honourable Governor of Telugu States Sri ESL Narasimhan, Tirupati JEO Sri P Bhaskar, Hindu Devlaya Parirakshana Peetham seer, Sri Kamalananda Swami, HDPP Secretary Sri Ramana Prasad and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీకాకుళంలో వైభవంగా శ్రీనివాస కల్యాణం

తిరుపతి, 2018 జూలై 09: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ మైదానంలో శ్రీవారికి వైభవంగా కల్యాణోత్సవం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో శ్రీవేంకటేశ్వర ధర్మరథయాత్ర జూన్‌ 9 నుంచి జూలై 9 వరకు నెల రోజుల పాటు 400 గ్రామాలలో యాత్ర సాగింది. ధర్మరథయాత్ర ముగింపు సందర్భంగా సాయంత్రం 6.30 గంటల వరకు 8.30 గంటల వరకు శ్రీనివాసకల్యాణం కమనీయంగా జరిగింది.

ఈ సందర్భంగా ఉదయం 6 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను నిర్వహించారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు భజన, ధార్మిక కార్యక్రమాలను చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు ధర్మరథంలోని స్వామివారిని దర్శించుకున్నారు.

హైందవ ధర్మ పరిరక్షణతోపాటు సమాజంలో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక విలువలను కూడా టిటిడి ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా ప్రాంతాల భక్తులకు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని కనులారా వీక్షించే భాగ్యాన్ని శ్రీనివాస కల్యాణాల ద్వారా టిటిడి కల్పిస్తోంది. దూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చి స్వామివారి కల్యాణోత్సవ సేవలో పాల్గొనలేని భక్తులకు ఈ కల్యాణాలు విశేష ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి.

సాయంత్రం 6.30 గంటల వరకు కల్యాణోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తిపరవశంతో పులకించారు.

ఈ కార్యక్రమంలో తెలుగురాష్ట్రాల గవర్నర్‌ శ్రీ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌, టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, హిందూ దేవాలయ పరిరక్షణ పీఠం శ్రీశ్రీశ్రీ కమలానంద భారతీ స్వామిజీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కార్యదర్శి డా. రమణ ప్రసాద్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.