SRINIVASA KALYANAM IN UDIPI ON JAN 28 _ జనవరి 28న క‌ర్ణాట‌క‌లో శ్రీనివాస కల్యాణం

Tirupati, 22 Jan. 20: Srinivasa Kalyanam Project of TTD will be organising Srinivasa Kalyanam festival at Udupi town in Dakshina Kannada district of Karnataka on January 28.

The venue will be at Girike mutt in the grounds of Arka Ganapathi temple. OSD of the Project Sri RS Gopal is supervising the arrangements.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

జనవరి 28న క‌ర్ణాట‌క‌లో శ్రీనివాస కల్యాణం

తిరుపతి, 2020 జనవరి 22:అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 28వ తేదీన క‌ర్ణాట‌క రాష్ట్రం ఉడిపిలోని గిరికెమ‌ఠంలో శ్రీవారి కల్యాణం వైభవంగా జరుగనుంది.

గిరికెమ‌ఠంలోని శ్రీ అర్క గ‌ణ‌ప‌తి ఆల‌య స‌మీపంలో గ‌ల మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వ‌హిస్తారు. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆర్ఎస్‌.గోపాల్ ఈ కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.