SRINIVASA KALYANAM PERFORMED WITH DEVOTIONAL WAVES HITTING SKY HIGH _ రామనగరలో కన్నుల పండువగాశ్రీనివాస కల్యాణం

ALL ROUTES LEAD TO RAMNAGAR STADIUM

SEA OF HUMANITY TURNS OUT FOR MEGA FETE

BENGALURU, 16 DECEMBER 2022: The celestial Srinivasa Kalyanam fete was observed with utmost religious grandeur and ecstasy at the spacious District Stadium Grounds in Ramnagar in Bengaluru on the pleasant evening on Friday.

ELABORATE ARRANGEMENTS

Elaborate arrangements were made by the donors comprising former CM of Karnataka Sri HD Kumara Swamy along with the local legislator Smt Anita Kumara Swamy, Sri Nikil Kumara Swamy and family.

FLORAL AND ELECTRICAL SETS 

The floral decorations, electrical illuminations, images of different deities including Lord Venkateswara, Goddess Padmavathi, Dasavatarams etc. stood as a cynosure on the auspicious occasion.

TTD ARCHAKAS PERFORM THE FETE

A team of TTD archakas and Veda pundits led by one of the Chief Preists of Tirumala temple Sri Krishna Seshachala Deekshitulu have performed the Srinivasa Kalyanam as per Vaikhanasa Agama tradition to the accompaniment of Melam and Mangala Vaidyam. The entire celestial event took place in big way under the personal supervision of TTD JEO for Education and Health Smt Sada Bhargavi.

TTD has been organizing the holy event in all the major cities and different places as a part of its noble mission to take forward Hindu Dharma Prachara across the country and in coordination with of philanthropists of the respective places.

SERIES OF RITUALS IN SRINIVASA KALYANAM:

The various stages of Srivari Kalyanam fete included Punyahavachanam, Viswaksena Aradhana, Ankurarpanam, Maha Sankalpam, Kanyadanam, Mangalya Dharana,Varana Mayiaram and finally Harati was rendered.

DEVOTEES ENTHRALLED

Every inch of the venue was occupied by devotees who thronged to witness the celestial Kalyanam with utmost devotion. The devotees were enthralled by the divine charm of the deities Sri-Bhu sameta Sri Srinivasa in their celestial splendour. The entire premises echoed to the divine chants of “Srinivasa..Venkataramana..Govinda..Govinda”.

FORMER PM TAKES PART

Former Prime Minister of India, Sri Deve Gowda along with his spouse Smt Chennamma Gowda also participated in this spiritual extravaganza.

The celestial event was conducted in a religious manner between 6pm and 8pm. The Annamacharya Artistes rendered Sankeetans in a melodious manner on the occasion.

The CEO SVBC Sri Shanmukh Kumar, VGO Sri Giridhar, SVETA Director Smt Prasanthi, HDPP Special Officer Smt Vijaya lakshmi, Aeo Kalyanam Project Sri Sriramulu, DyEEs Sri Sarvesh, Sri Manohar and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రామనగరలో కన్నుల పండువగాశ్రీనివాస కల్యాణం

– వేలాదిగా హాజరైన భక్తులు

– కళ్ళు మిరుమిట్లు గొలిపేలా శోభాయమానంగా వేదిక నిర్మాణం

– భారీ ఎత్తున పుష్ప, విద్యుత్ అలంకరణలు

-. ఆకట్టుకున్న అన్నమాచార్య సంకీర్తనల గానం

– గోవింద నామస్మరణతో మార్మోగిన జిల్లా స్టేడియం మైదానం

తిరుపతి, 16 డిసెంబరు2022: కర్ణాటక రాష్ట్రం రామనగరలోని జిల్లా స్టేడియం మైదానంలో శుక్రవారం రాత్రి టీటీడీ ఆధ్వర్యంలో దాత , శాసన సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కుమార స్వామి, ఆయన సతీమణి, స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి అనిత కుమార స్వామి దంపతులు నిర్వహించిన శ్రీనివాస కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్ళు మిరిమిట్లు గొలిపేలా శోభాయమానంగా నిర్మించిన కల్యాణ వేదిక, భారీ ఎత్తున ఏర్పాటు చేసిన పుష్ప , విద్యుత్ అలంకరణల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని చూసి తరించారు.

సాయంత్రం 6 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మధుపర్క సమర్పణ, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో శాస్త్రోక్తంగా కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం అత్యంత వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా కల్యాణంలోని ఆయా ఘట్టాలకు అనుగుణంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా గానం చేశారు. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని తిలకించిన వేలాది మంది భక్తజనం చేసిన గోవిందనామ స్మరణతో వేదిక ఆవరణం మార్మోగింది. భక్తులందరు శ్రీవారి కల్యాణాన్ని చూసేందుకు వేదిక ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో ఎల్ ఈ డి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.

కల్యాణంలో పాల్గొన్న మాజీ ప్రధాని శ్రీ దేవెగౌడ

మాజీ ముఖ్యమంత్రి శ్రీ కుమార స్వామి సౌజన్యంతో నిర్వహించిన శ్రీనివాస కల్యాణంలో మాజీ ప్రధాన మంత్రి శ్రీ దేవెగౌడ తన సతీమణి శ్రీమతి చెన్నమ్మ దేవెగౌడతో పాటు పాల్గొన్నారు.

టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి పర్యవేక్షణలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కృష్ణ శేషాచల దీక్షితులు, అర్చక బృందం నిర్వహించిన శ్రీనివాస కల్యాణ కార్యక్రమంలో శ్రీ నిఖిల్ కుమార స్వామి గౌడ దంపతులు,ఎస్వి బిసి సిఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, హెచ్ డి పిపి ప్రత్యేకాధికారి శ్రీమతి విజయలక్ష్మి, విజివో శ్రీ గిరిధర్, కల్యాణం ప్రాజెక్టు ఎఈవో శ్రీ శ్రీరాములు, డిప్యూటీ ఈ ఈ లు శ్రీ సర్వేష్, శ్రీ మనోహర్ తో పాటు వేలాది మంది భక్తులు, రామనగర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.