SRINIVASA KALYANAMS _ నవంబరులో 3 రాష్ట్రాల్లో శ్రీనివాస కల్యాణాలు
Tirupati, 01 Nov 19 ; The Srinivasa Kalyanams will be observed at different places in AP, TS and Karnataka in the month of November under the aegis of Srinivasa Kalyanam Project of TTD.
These celestial weddings will be observed at 14 places in these states from November 2 to 24.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
నవంబరులో 3 రాష్ట్రాల్లో శ్రీనివాస కల్యాణాలు
నవంబరు 01, తిరుపతి, 2019 ;శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా, సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చి శ్రీవారి కల్యాణాలను చూడలేని భక్తులకోసం టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో టిటిడి శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా నవంబరులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని 14 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.
అనంతపురం జిల్లాలో
– నవంబరు 2వ తేదీన గోరంట్ల మండలం గుంతపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
– నవంబరు 3న మడకశిర మండలం రేకులకుంట గ్రామంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.
– నవంబరు 4న కల్యాణదుర్గం మండలం లక్ష్మీపురం గ్రామంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.
– నవంబరు 5న ఆత్మకూరు మండలం పాపంపల్లి గ్రామంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.
– నవంబరు 6న బుక్కరాయసముద్రం మండలం కె.చెదుల్ల గ్రామంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
కడప జిల్లాలో
– నవంబరు 7న గాలివీడు మండలం గరుగుపల్లి గ్రామంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.
తెలంగాణలో…
– నవంబరు 3న కరీంనగర్ జిల్లా మంథనిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు.
– నవంబరు 10, 16వ తేదీల్లో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.
అదిలాబాద్ జిల్లాలో…
– నవంబరు 11న కౌతుల మండల కేంద్రంలోని కంకతల ఆలయ సమీపంలోని మినీ స్టేడియంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.
– నవంబరు 12న దహేగౌన్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.
– నవంబరు 13న తిర్యాని మండలం, గంగాపూర్‌లోని శ్రీ బాలాజి వేంకటేశ్వర ఆలయంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.
– నవంబరు 14న ఇంద్రవెల్లి మండలం, దేవపూర్ గ్రామంలోని ఓరియంటల్ సిమెంట్ కంపెనీ స్టేడియంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
– నవంబరు 15న కెరిమేరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారు.
కర్ణాటకలో…
– నవంబరు 24న కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గాలోని ఎన్‌వి మైదానంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.