SRINIVASA KALYANAMS AT NORTH COASTAL AP FROM JUNE 04-15 _ జూన్‌ 4 నుంచి 15వ తేదీ వరకు విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో శ్రీనివాస కల్యాణాలు

Tirupati, 03 June 2018 : TTD plans to conduct its devotee friendly program of Srinivasa Kalyanams at nine locations in the districts of Vizianagaram and Visakhapatnam from June 04-15 in the SC/ST colonies as part of its campaign to promote Sanatana Dharma and Bhakti culture.

Vizianagaram Dist

· June 4 : ST colony of Jiyammavalasa Mandal

· June 5: Kothuru village of Gurugubilli mandal

· June 6: Shivanna doravalasa village of Parvatipuram mandal

· June 7 : Eurululapakalu village of Badhangi mandal

Visakhapatnam Dist

· June 11: Koyyuru mandal centre

· June 12: Pogachatla palyam village of Golugonda mandal

· June 13: Fisherman colony Veda Narasapuram,of Rambilli mandal

· June 14: ST Colony of Chuchukonda village of Munapaka mandal

· June 15 : SC colony of Gudivada village of Rayavaram mandal

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్‌ 4 నుంచి 15వ తేదీ వరకు విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, 2018 జూన్‌ 03టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో జూన్‌ 4 నుంచి 15వ తేది వరకు విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలోని 9 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. అన్నిచోట్లా సాయంత్రం 6 గంటలకు కల్యాణాలు ప్రారంభంకానున్నాయి.

విజయనగరం జిల్లాలో….

– జూన్‌ 4వ తేదీన జియమ్మవలస మండల కేంద్రంలోని ఎస్‌టి కాలనీలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– జూన్‌ 5న గురుగుబిల్లి మండలం, కొతూరు గ్రామంలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

– జూన్‌ 6న పార్వతీపురం మండలం, శివన్నదొరవలస గ్రామంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– జూన్‌ 7న బాదాంగి మండలం, ఏరుకులపాకలు గ్రామంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

విశాఖపట్నం జిల్లాలో…

– జూన్‌ 11న కొయ్యూరు మండల కేంద్రంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– జూన్‌ 12న గొలుగొండ మండలం,పొగచెట్లపాళ్యం గ్రామంలోని ఎస్‌టి కాలనీలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– జూన్‌ 13న రాంబిల్లి మండలం,వేదనరసాపురం గ్రామంలోని మత్సకార కాలనీలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– జూన్‌ 14న మునగపాక మండలం,చూచూకొండ గ్రామంలోని ఎస్‌సి కాలనీలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– జూన్‌ 15న ఎస్‌.రాయవరం మండలం,గుడివాడ గ్రామంలోని ఎస్‌సి కాలనీలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి కల్యాణం జరుగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.