SRINIVASA KALYANAMS IN PRAKASAM DISTRICT FROM DECEMBER 18 _ డిసెంబ‌రు 18 నుండి ప్ర‌కాశం జిల్లాలో శ్రీ‌నివాస క‌ల్యాణాలు

Tirupati, 8 December 2019:The Srinivasa Kalyanam project of TTD is conducting Srinivasa Kalyanam in all remote parts of state to spread the glory of Sri Venkateswara Swamy and also facilitating the devotees who could come to Tirumala to witness the celestial event.

As a part of the campaign, the unique festival is conducted at Ramalayams in seven locations from December 18 in the Prakasam district under the supervision of Dr C Rajagopalan, the Secretary of SKP and HDPP.

December 18: Ramachandrunikota village of Dornala mandal

December 19: Veligondla mandal HQ

December 20: Tekkellapadu village of Hanumantunipadu mandal.

December 21: Venkatasubbaiahpalem  village of Vetapalem mandal

December 22: Chakirevu colony Kothapatnam mandal

December 23: Kandukur village of Tanguturu mandal

December 24: Singarayakonda village of Singarayakonda  mandal.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

డిసెంబ‌రు 18 నుండి ప్ర‌కాశం జిల్లాలో శ్రీ‌నివాస క‌ల్యాణాలు

తిరుప‌తి, 08 డిసెంబ‌రు 2019 ;  శ్రీ‌వారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా, సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చి శ్రీవారి కల్యాణాలను చూడలేని భక్తులకోసం టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో టిటిడి శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. ఇందులోభాగంగా డిసెంబ‌రు 18వ తేదీ నుండి ప్ర‌కాశం జిల్లాలో 7 ప్రాంతాల్లో శ్రీ‌నివాస క‌ల్యాణాలు జ‌రుగ‌నున్నాయి. ఆయా ప్రాంతాల్లోని రామాల‌యాల్లో సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు క‌ల్యాణాలు నిర్వ‌హిస్తారు. శ్రీ‌నివాస క‌ల్యాణం ప్రాజెక్టు కార్య‌ద‌ర్శి ఆచార్య రాజ‌గోపాల‌న్ ఈ క‌ల్యాణాల ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

– డిసెంబ‌రు 18న డోర్నాల మండలం రామచంద్రునికోట‌.

– డిసెంబ‌రు 19న వెలిగాండ్ల మండల కేంద్రం.

– డిసెంబ‌రు 20న హ‌నుమంతునిపాడు మండ‌లంలోని త‌క్కెళ్ల‌పాడు గ్రామం.

– డిసెంబ‌రు 21న వేట‌పాళెం మండ‌లంలోని వెంక‌ట‌సుబ్బ‌య్య‌పాళెం గ్రామం.

– డిసెంబ‌రు 22న కొత్త‌ప‌ట్నంలోని చాకిరేవు కాల‌నీ.

– డిసెంబ‌రు 23న టంగుటూరు మండ‌లంలోని కందులూరు గ్రామం.

– డిసెంబ‌రు 24న సింగ‌రాయ‌కొండ మండ‌లంలోని పాత సింగ‌రాయ‌కొండ గ్రామం.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.