SRINIVASA MANGAPURAM ALL SET FOR ANNUAL BRAHMOTSAVAMS _ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయండి : తితిదే తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి
TIRUPATI, FEB 28: The famous temple of Lord Kalyana Venkateswara at Srinivasa Mangapuram, about 16km from Tirupati, is all set for the annual mega event of brahmtosavams, said, TTD JEO Tirupati Sri P Venkatrami Reddy.
The JEO who inspected the elaborate arrangements here on Thursday, talking to media persons said, the nine-day mega religious event of Lord Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram is scheduled for March 1 to March 9.
He said TTD has made arrangements on par with annual brahmotsavams of Lord Venkateswara of Tirumala.
He said about 200 bhajan teams visited near by 160 villages at Srinivasa Mangapuram and distributed over two lakh pamphlets inviting the denizens to take part in this festival.
“This year we are organizing Sobha Yatra in Tirupati on March 3 where the famous lakshmi haram which used to be adorned to Lord Malayappa Swamy during Garuda Seva at Tirumala will be taken on a grand procession from Alipiri Padala Mandapam to Srinivasa Mangapuram.
Sri Kalyana Venkateswara Swamy will be decorated with this Lakshmi Haram on the day of Garuda Seva which falls on March 5”, he maintained.
Elaborating further the JEO said laddu prasadam and Vada prasadam selling stalls will also be set up during the nine-day mega event. The HDPP will arrange religious, spiritual and devotional programmes including Bhajans, Kolatams etc. which is going to be a special attraction during the brahmotsavams.
Later the JEO also briefed on Sri Kapileshwara Swamy annual Brahmotsavams which are scheduled from March 3 to 12. “On the day of Maha Sivarathri which falls on March 10, there will be special programmes in Mahati Auditorium including spiritual discourse by Kurthalam seer Sri Bharati Teertha Swamy and Sivakavulu-literary play.
Local temples Deputy EO Smt Reddemma, HDPP OSD Sri Raghunath, SE III Sri Sudhakar Rao were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయండి : తితిదే తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి
తిరుపతి, ఫిబ్రవరి 28, 2013 : మార్చి ఒకటి నుండి తొమ్మిదో తేదీ వరకు జరుగనున్న శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి భక్తులకు పిలుపునిచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీనివాసమంగాపురంలోని ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లను గురువారం ఉదయం ఆయన పరిశీలించారు.
అనంతరం జెఈవో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది స్వామివారి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. స్థానిక ఆలయాలను అభివృద్ధి చేసేందుకు తితిదే ప్రాధాన్యత ఇస్తోందని, దీనివల్ల తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు మరిన్ని ఆలయాలు దర్శించే వెసులుబాటు కలుగుతుందని వివరించారు. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రూ.కోటితో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో మొదటిసారిగా గ్యాలరీలు ఏర్పాటుచేశామని, భక్తులు ప్రశాంతంగా కూర్చుని వాహనసేవల సమయంలో సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకోవచ్చని తెలిపారు. రథమండం, వాహన మండపం, గోశాల, బ్యారికేడ్లు, సెల్‌ఫోన్లు, పాదరక్షలు భద్రపరుచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. భక్తులందరికీ అన్నదాన వితరణ, వైద్యశిబిరం, పుస్తక విక్రయశాలలు ఏర్పాటు చేయనున్నామని, మరుగుదొడ్లు, పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. శ్రీనివాస కల్యాణం అనే అంశంతో పుష్పప్రదర్శన, స్వామివారి వాహనాల ప్రదర్శన, భక్తులను ఆకట్టుకునేలా విద్యుద్దీపాలంకరణ చేసినట్టు తెలిపారు.
మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3.00 గంటల నుండి తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం నుండి శ్రీనివాసమంగాపురం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నామని, ఇందులో గరుడసేవ రోజు తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారికి అలంకరించే లక్ష్మీహారాన్ని ఊరేగింపుగా తీసుకురానున్నామని వెల్లడించారు. మార్చి 5వ తేదీ గరుడసేవ సందర్భంగా ఉదయం 7.00 గంటలకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి ఆండాళ్ అమ్మవారి పూలమాలలను ఆలయమర్యాదలతో నగర సంకీర్తనగా ఉదయం 11.00 గంటలకు శ్రీనివాస మంగాపురంలోని శ్రీవారి సన్నిధికి చేర్చనున్నట్టు తెలిపారు. తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్తు, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం 6.00 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు భక్తి, సాంస్కృతిక, సంగీత మరియు భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రచార రథాలను ఏర్పాటుచేసి 160 గ్రామాల ప్రజలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించినట్టు జెఈవో తెలిపారు. భక్తులందరికీ విక్రయించేందుకు వీలుగా శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాలను అందుబాటులో ఉంచుతామన్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే తితిదే ఉద్యోగుల కోసం తిరుపతిలోని పరిపాలనా భవనం నుండి ఉచితంగా బస్సులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
అదేవిధంగా మార్చి 3 నుండి 12వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్టు జెఈవో తెలిపారు. ఇందులో భాగంగా మార్చి 10వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థ స్వామివారిచే శైవక్షేత్రాల వైశిష్ట్యంపై ప్రవచనాలు, 16 మంది ప్రముఖ సాహితీవేత్తలతో ”శివకవులు” సాహితీరూపకం ప్రదర్శించనున్నట్టు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో తితిదే స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి రెడ్డెమ్మ, హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి శ్రీ ఎస్.రఘునాధ్, తితిదే సూపరింటెండెంట్ ఇంజినీరు శ్రీ సుధాకరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు శ్రీ నాగేశ్వరరావు, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.