SRINIVASA ON SARVABHOOPALA _ సర్వభూపాల వాహ‌నంపై శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ‌నివాసుడు

TIRUMALA, 12 OCTOBER 2021: Sri Malayappa Swamy as Sri Bhu Sameta Srinivasa cheered devotees on Sarvabhoopala Vahanam on Tuesdayevening.

In the place of Swarna Ratham, the Sarvabhoopala Vahana Seva took place at Kalyanotsava Mandapam as part of ongoing annual Brahmotsavam on sixth day evening.

TTD EO Dr KS Jawahar Reddy and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

సర్వభూపాల వాహ‌నంపై శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ‌నివాసుడు

తిరుమ‌ల‌, 2021 అక్టోబ‌రు 12: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగ‌ళ‌వారం సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థం బదులుగా శ్రీవారి ఆలయంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై దర్శనమిచ్చారు.

సర్వభూపాల అంటే రాజుల‌కు రాజు అని అర్థం. ఈ ప్ర‌పంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భ‌క్త లోకానికి చాటి చెపుతూ స్వామివారు ఈ వాహ‌నాన్ని అధిష్టించారు.

ఈ వాహ‌న‌సేవ‌లో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌మ‌బాబు, ఒఎస్డీ శ్రీ పాల శేషాద్రి పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.