SRINIVASA TEMPLE MAHASAMPROKSHANAM ON APRIL 27_ ఏప్రిల్‌ 27న తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయ మహాసంప్రోక్షణ

Tiruchanoor, 26 April 2018: The Maha Samprokshanam in TTD taken over Sri Srinivasa temple in Tiruchanoor will be observed on April 27.

This celestial fete will be observed between 9am and 10am on Friday.

Temple Spl Gr DyEO Sri Munirathnam Reddy is supervising the arrangements.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఏప్రిల్‌ 27న తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయ మహాసంప్రోక్షణ

ఏప్రిల్‌ 26, తిరుపతి 2018: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ శ్రీనివాస ఆలయ పున:ప్రతిష్ట, మహాసంప్రోక్షణ ఏప్రిల్‌ 27వ తేదీ శుక్రవారం ఘనంగా జరుగనుంది. ఉదయం 9 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

ఏప్రిల్‌ 23వ తేదీ నుండి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం ఆలయంలో స్వామివారు, అమ్మవారు, ఆళ్వార్ల నూతన విగ్రహాలను స్థాపన చేశారు. ఆ తరువాత శ్రీస్వామివార్లకు పంచ శయనాధివాసం, మహాశాంతి హోమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రత్యేకశ్రేణి డిప్యూటీ ఈవో శ్రీమునిరత్నంరెడ్డి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ ఈశ్వరయ్య, ఋత్వికులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.