SRIVANI DARSHAN TICKET COUNTER AT TIRUPATI AIRPORT CHANGES _ తిరుప‌తి విమానాశ్రయంలోని శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్ మార్పు

Tirumala, 15 December 2023: TTD has been issuing 100 numbers of offline SRIVANI tickets every day at Tirupati airport for the convenience of air passengers coming from abroad and across the country to visit Tirumala for Srivari darshan.

However, due to the non-permission of issuance of SRIVANI tickets at the airport, from Saturday, the December 16 onwards, these tickets will be issued at the Gokulam Rest House in Tirumala instead of the airport. 

Every day 100 tickets will be issued to the devotees who have submitted their boarding pass as usual for SRIVANI darshan offline tickets.

Therefore, the devotees are requested to observe the change.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుప‌తి విమానాశ్రయంలోని శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్
మార్పు

•⁠ ⁠డిసెంబ‌రు 16వ తేదీ నుండి తిరుమల గోకులం విశ్రాంతి భ‌వ‌నంలో టికెట్ల జారీ

తిరుమ‌ల‌, 2023 డిసెంబ‌రు 15: దేశ విదేశాల నుండి తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే విమాన ప్ర‌యాణికుల సౌక‌ర్యార్థం తిరుపతి విమానాశ్రయంలో ప్ర‌తి రోజు 100 ఆఫ్‌లైన్‌ శ్రీవాణి టికెట్లను టీటీడీ జారీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే విమానాశ్రయంలో శ్రీ‌వాణి టికెట్ల జారీకి అనుమ‌తి లేని కార‌ణంగా డిసెంబ‌రు 16వ తేదీ శ‌నివారం నుండి విమానాశ్రయంకు బ‌దులుగా తిరుమ‌ల గోకులం విశ్రాంతి భ‌వ‌నంలో జారీ చేస్తారు. ప్ర‌తి రోజు 100 టికెట్ల‌ను బోర్డింగ్ పాస్ స‌మ‌ర్పించిన భ‌క్తుల‌కు య‌ధావిధిగా శ్రీ‌వాణి ద‌ర్శ‌న ఆఫ్‌లైన్ టికెట్ల‌ను ఇవ్వ‌డం జ‌రుగుతుంది.

కావున భక్తులు విమానాశ్రయంలో శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ కౌంటర్ మార్పును గమనించాలని కోరడమైనది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.