SRIVARI ANNUAL TEPPOTSAVAM FROM MARCH 13-17 _ మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
Tirumala, 7 Mar. 22: TTD is organising a five-day fete of the annual Srivari float festival (Teppotsavam) from March 13-17.
Teppotsavam is known as “Tiruppalli Odai Tirunal” in Tamil and is Hailed as Teppa Tirunalllu in Telugu and the celebrations have a legacy from 1468 organised by King Saluva Narasimha Rayalu.
Later Saint Poet Sri Tallapaka Annamaiah has heralded the event as a prominent utsava conducted in Tirumala during hot summer days bringing the cool breeze of the float festival as a feast to devotees.
The float festival will be celebrated daily in the evening between 7pm and 8pm with utsava idols of Swami and Ammavaru riding decorated floats after procession on Mada streets.
On first two days then utsava idols of Sri Sita Lakshmana Sameta Sri Ramachandra, Sri Rukmini Devi and Sri Krishna will take three rounds on floats and enthrall devotees.
Later utsava idols of Sri Malayappa with consorts Sri Devi and Sri Bhudevi will go round three rounds (third day) five rounds (fourth day) and seven rounds on (fifth day) and bless devotees.
ARJITA SEVAS CANCELLED
In view of the Teppotsavam festival, the TTD has appealed to devotees to make a note that it has cancelled the virtual arjita sevas of Sahasra Deepalankara Seva on March 13,14 and Arjita Brahmotsavam, and Sahasra Deepalankara Seva on March 15,16,17.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
తిరుమల, 2022 మార్చి 07: తిరుమలలో మార్చి 13 నుంచి 17వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరుగనున్నాయి.
తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో ‘తిరుపల్లి ఓడై తిరునాళ్’, తెలుగులో ‘తెప్ప తిరునాళ్లు అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. శ్రీ సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో ”నీరాళి మండపాన్ని” నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లల్లో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి.
తెప్పోత్సవాలను ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడవీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు. ఇక చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు.
ఆర్జితసేవలు రద్దు :
తెప్పోత్సవాల కారణంగా వర్చువల్ అర్జితసేవలైన సహస్రదీపాలంకార సేవను మార్చి 13, 14వ తేదీల్లో మార్చి 15, 16, 17వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.