SRIVARI ANNUAL VASANTHOTSAVAM ENDS _ ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

Tirumala, 26 Apr. 21: The three-day annual festival of Vasantothsavam concluded at Srivari temple on Monday.

On the final day Sri Malayappa Swamy along with Sridevi and Bhudevi, Sri Rama with Sita Devi, Lakshmana Swamy and Anjaneya Swamy and Sri Krishna Swamy with Rukmini Devi were rendered celestial bath inKalyanotsava Mandapam.

It was a visual feast to the devotees who are present globally to witness the snapana tirumanjanam to all the nine utsavarulu at a time through the live streaming of the religious event on SVBC

This religious event took place between 2pm and 4pm. In view of the COVID 19 lockdown restrictions, TTD performed the event in Kalyanotsava Mandapam this year instead of Vasanthotsava Mandapam.

Thereafter in the evening, Asthanam was held and at night the utsava idols of Sri Malayappa and his consorts were paraded on the Mada streets.

Tirumala pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy, TTD EO Dr KS Jawahar Reddy couple, CVSO Sri Gopinath Jatti, Srivari temple DyEO Sri Harindranath, other officials were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

ఏప్రిల్ 26, తిరుమల 2021: తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో మూడురోజులపాటు ఏకాంతంగా జ‌రిగిన‌ సాలకట్ల వసంతోత్సవాలు సోమ‌వారం ముగిశాయి.

చివరిరోజు శ్రీ‌దేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, శ్రీ రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. రాత్రి 7 గంట‌ల‌కు స్వామి, అమ్మ‌వార్ల‌ను ఆల‌య నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేప‌డ‌తారు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.