SRIVARI ANNUAL VASANTHOTSAVAM FROM APRIL 14-16 _ ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
Tirumala, 11 April 2022: The three-day annual Vasantothsavam fete of Srivari temple will be conducted from April 14-16 as a part of practice to conduct this spring festival every year which concludes on Chaitra Suddha Pournami day.
As part of the festivities, a procession of utsava idols of Sri Malayappa and His consorts will be conducted on Mada streets on April 14 and later seated in Vasantothsavam mandapam for Abhishekam and later returned to Srivari temple.
On April 15 there will be procession of Bangaru Ratham in the morning.
On the last day on April 16 Sri Malayappa and His consorts along with Sri Sita Rama Lakshmana and Anjaneya, Rukmini sameta Sri Krishna will participate in the Vasantothsavam fete and later return to Srivari temple.
On all three days, grand Snapana Tirumanjanam fete is performed for utsava idols of Swami and consorts.
During the Vasantothsavam fete, Swamy is worshipped with perfumed flowers and a variety of fruits.
In view of Vasantothsavam fete TTD has cancelled the Kalyanotsavam, Unjal Seva, arjita Brahmotsavam, Sahasra Deepalankara sevas on April 14-16and Nija pada Darshan Seva on April 15.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమల, 2022 ఏప్రిల్ 11: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.
ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఏప్రిల్ 14వ తేదీన ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తియిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
రెండవరోజు ఏప్రిల్ 15న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 9 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు ఏప్రిల్ 16న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.
ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.
వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ సంభరిత వికాస పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను తెచ్చి స్వామికి నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ.
వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 14 నుండి 16వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, ఏప్రిల్ 15న నిజపాద దర్శనం సేవను టిటిడి రద్దు చేసింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.