SRIVARI LADDU PRASADAM READY FOR AYODHYA _ అయోధ్య‌కు శ్రీ‌వారి ల‌డ్డూప్ర‌సాదం సిద్ధం

Tirumala, 18 January 2024:TTD has set ready to dispatch one lakh Laddus weighing 25 gms for distributing Laddus as Srivari Prasadam at Ayodhya on the occasion of Vigraha pratista at Sri Ram Madiram on January 22.

Nearly 350 Srivari Sevakulu were engaged in this divine activity at Seva Sadan -1 in Tirumala for packing two laddus in each packet in 350 boxes with each box having a capacity to carry 150 packets.

Dyeo (General) Sri Siva Prasad, Potu AEO Sri Srinivasulu and other staff were present.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అయోధ్య‌కు శ్రీ‌వారి ల‌డ్డూప్ర‌సాదం సిద్ధం

తిరుమల, 18 జ‌న‌వ‌రి, 2024 ;అయోధ్యలో ఈ నెల 22వ తేదీ శ్రీ రామ‌చంద్రుల‌వారి విగ్ర‌హప్ర‌తిష్ట‌, శ్రీ‌రామ మందిరం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష చిన్న లడ్డూల‌ను శ్రీ‌వారి ప్ర‌సాదంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేప‌ట్టింది.

ఇందుకోసం గురువారం తిరుమ‌లలోని శ్రీ‌వారి సేవాస‌ద‌న్‌-1లో శ్రీ‌వారి సేవ‌కులు ఒక్కో క‌వ‌ర్‌లో రెండు చిన్న‌ ల‌డ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. ఈ విధంగా మొత్తం 350 బాక్సుల‌ను సిద్ధం చేశారు. 350 మంది శ్రీ‌వారి సేవ‌కులు ఈ సేవ‌లో పాల్గొన్నారు. ఈ ల‌డ్డూల‌ను అయోధ్య‌కు పంప‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవో జ‌న‌ర‌ల్ శ్రీ శివ‌ప్ర‌సాద్‌, పోటు ఏఈవో శ్రీ శ్రీ‌నివాసులు త‌దిత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.