SRIVARI PADALU PARADED _ వైభవంగా శ్రీవారి పాదాల‌ ఊరేగింపు

IRUPATI, 25 NOVEMBER 2022: Srivari Swarna Padalu which usually adorns the holy feet of Sri Malayappa, were brought from Tirumala temple in a procession and reached Pasupu Mandapam in Tiruchanoor on Friday.

These divine feet were rendered special puja amidst Mangala Vaidyam. These golden feet will be adorned to Goddess Sri Padmavathi Devi during Garuda Vahana Seva on Friday evening. 

JEO Sri Veerabrahmam, DyEO Sri Lokanatham, AEO Sri Prabhakar Reddy, Archaka Sri Babu Swamy, Arjitam Inspector Sri Damodar were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

వైభవంగా శ్రీవారి పాదాల‌ ఊరేగింపు

తిరుపతి, 2022 నవంబరు 25: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్రవారం రాత్రి గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి పాదాల‌ ఊరేగింపు వైభవంగా జరిగింది.

తిరుమల శ్రీవారి ఆలయం నుండి స్వామివారి స్వర్ణపాదాల‌ను మొదట తిరుచానూరులోని పసుపుమండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. అమ్మవారి గరుడసేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదాలు తీసుకురావడం ఆనవాయితీగా వ‌స్తోంది. గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదాల‌ను పంపుతున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు శ్రీ బాబు స్వామి, ఆర్జితం ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ దాము పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.