SRIVARI SEVA VOLUNTARY SERVICE SHOULD BECOME ROLE MODEL TO THE ENTIRE WORLD-TIRUMALA JEO_ భక్తులకు అత్యుత్తమ సేవల కోసం శ్రీవారి సేవలో నూతన మార్పులు : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

REFORMATORY CHANGES SOON IN SRIVARI SEVA

“ALAYA SWATCHA SEVA” ON CHORDS

Tirumala, 18 August 2017: “The Srivari Seva has become one of the chief supporting arms of TTD in rendering selfless services to fellow pilgrims both at Tirumala and Tirupati and very soon it is set to emerge as role model Voluntary Service in the entire world”, asserted Tirumala JEO Sri KS Sreenivasa Raju.

A three-hour long review meeting on Srivari Seva voluntary service with the HoDs of various user departments took place in Gokulam Conference Hall in Tirumala on Friday with Tirumala JEO. The JEO instructed the HoDs to assess the requirement of Srivari Sevakulu categorizing the their utility for normal and peak days. “The user departments should take the attendance of sevakulu and deploy them only as per their requirement”, he added.

The JEO also said, apart from general srivari seva, the Parakamani Seva which was launched in 2012 August and Laddu Prasada Seva in 2013 have also become stabilised today. On the lines of Amritsar Golden temple where in the devotees turn up as volunteers in temple cleansing activity, we are contemplating to commence “Alaya Swatcha Seva” in Tirumala temple soon. Apart from this we are also bring reformatory changes in the next couple of weeks in the Srivari Seva and make it more pilgrim-friendly voluntary service. By next three months the Srivari Seva will shift into the new building which is coming up behind Kalyana Vedika”, he maintained.

DyEOs Sri Kodanda Rama Rao, Sri Venugopal, Sri Venkataiah, Sri Harindranath, Smt Jhansi, IT Wing Head Sri Sesha Reddy, Health Officer Dr Sermista, VGO Sri Ravindra Reddy, PRO Dr T Ravi and other officers were also present.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

భక్తులకు అత్యుత్తమ సేవల కోసం శ్రీవారి సేవలో నూతన మార్పులు : జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు

ఆగస్టు 18, తిరుమల, 2017: శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత ఉన్నతమైన ప్రమాణాలతో అత్యుత్తమ సేవలు అందించేందుకు శ్రీవారి సేవ విభాగంలో నూతన మార్పులు తీసుకురానున్నట్టు టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో గల సమావేశ మందిరంలో శుక్రవారం శ్రీవారి సేవ విభాగంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ సంవత్సరం పొడవునా శ్రీవారి సేవకులు తమ తోటి భక్తులకు ఇతోధిక సేవలందిస్తున్నారని తెలిపారు. సాధారణ రోజుల్లో రోజుకు 1500 మంది, విశేష పర్వదినాల సమయంలో 3 వేల మందికిపైగా సేవకులు టిటిడిలోని వివిధ విభాగాల్లో విశేష సేవలు చేస్తున్నారని వివరించారు. పది మందికి తక్కువ కాకుండా బృందంగా ఏర్పడి ఆన్‌లైన్‌ ద్వారాగానీ, ఉత్తరాల ద్వారాగానీ సేవకు నమోదు చేసుకోవచ్చన్నారు. శ్రీవారి సేవకు అనుబంధంగా 2012, ఆగస్టు 17న పరకామణిసేవ, 2013, జనవరి 13న లడ్డూ ప్రసాద సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. తిరుపతిలోని స్థానికాలయాల్లోనూ శ్రీవారి సేవకులు సేవలందిస్తున్నట్టు చెప్పారు.

టిటిడి అవసరాలకు తగ్గట్టు సేవకులు రావాల్సి ఉందని, భవిష్యత్తులో శ్రీవారి సేవను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని జెఈవో తెలిపారు. ఆయా విభాగాల్లో శ్రీవారి సేవకులు ఎంతమంది అవసరమో గుర్తించి ఆ మేరకు కేటాయిస్తున్నట్టు చెప్పారు. టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు త్వరలో శ్రీవారి ఆలయంలో ‘ఆలయ స్వచ్ఛ సేవ'(ఫ్లోర్‌ క్లీనింగ్‌)ను ప్రవేశపెట్టేందుకు యోచిస్తున్నట్టు తెలిపారు. శ్రీవారి సేవకుల నుంచి ముందుగా అంగీకారం తీసుకుని ఈ సేవకు వినియోగిస్తామని, ఆరోగ్యశాఖాధికారిణి ప్రత్యక్ష పర్యవేక్షణలో వీరు ఆలయంలో సేవలు అందించాల్సి ఉంటుందని తెలియజేశారు. మరో మూడు నెలల్లో నూతన శ్రీవారి సేవాసదన్‌ భవనాన్ని ప్రారంభించి, సేవకులకు మరింత మెరుగైన బస కల్పిస్తామని, శిక్షణ కార్యక్రమాలు మెరుగుపరుస్తామని వివరించారు.

ఈ సమావేశంలో టిటిడి డెప్యూటీ ఈవోలు శ్రీ కోదండరామారావు, శ్రీ వేణుగోపాల్‌, శ్రీవెంకటయ్య, శ్రీమతి ఝాన్సీ, శ్రీ హరీంద్రనాథ్‌, ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి, విజివో శ్రీ రవీంద్రారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ట, క్యాటరింగ్‌ అధికారి శ్రీ జిఎల్‌ఎన్‌.శాస్త్రి, గార్డెన్‌ సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాస్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తిరుపతిలో శ్రీవారి సేవకుల నమోదు ప్రారంభం :

తిరుపతిలోని విష్ణునివాసంలో గల శ్రీవారి సేవ కార్యాలయంలో శుక్రవారం నుంచి కంప్యూటర్‌ ద్వారా శ్రీవారి సేవకుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఇదివరకు సేవకుల వివరాలను మాన్యువల్‌గా నమోదు చేసేవారు. తిరుపతిలో సేవలందించిన శ్రీవారి సేవకులు తిరుమలకు వెళ్లిన తరువాత తిరిగి నమోదు చేసుకునే అవసరం లేకుండా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.