SRIVARI SEVAKULU SERVE DEVOTEES WITH DEDICATION _ ⁠అంకితభావంతో శ్రీవారి సేవకుల సేవ‌లు

ర‌థ‌స‌ప్త‌మినాడు మాడ వీధుల్లో సీనియర్‌ అధికారుల పర్యవేక్షణ

•⁠ ⁠అంకితభావంతో శ్రీవారి సేవకుల సేవ‌లు

తిరుమల, 2024, ఫిబ్ర‌వ‌రి 16: టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం ర‌థ‌స‌ప్త‌మినాడు భ‌క్తులకు అందుతున్న సౌక‌ర్యాల‌ను పర్యవేక్షించారు. నాలుగుమాడ వీధుల్లో సీనియర్‌ అధికారుల‌ను నియమించారు. వీరు కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకొని మరింత సమర్థవంతంగా సకాలంలో భక్తులకు సేవలందించే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టారు.

నాలుగు మాడ వీధుల‌కు క‌లిపి ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావుకు ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అదేవిధంగా, తూర్పు మాడ వీధిలో డిఎఫ్ఓ శ్రీ శ్రీనివాసులు, ప‌డ‌మ‌ర మాడ వీధిలో డెప్యూటీ ఈవో శ్రీ శివప్రసాద్, ద‌క్షిణ మాడ వీధిలో ఇఇ శ్రీ జి.వి.కృష్ణారెడ్డి, ఉత్త‌ర మాడ వీధిలో ఇఇ శ్రీ మల్లికార్జున ప్రసాద్, డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి భ‌క్తులకు అందుతున్న సేవ‌ల‌ను ప‌ర్య‌వేక్షించారు.

అదేవిధంగా, అదనపు ఎఫ్ఏసిఏఓ శ్రీ రవిప్రసాదు, సిఏఓ శ్రీ శేషశైలేంద్ర, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి ఇతర అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఏర్పాట్లు చేశారు. మాడ వీధుల్లో వీరి పర్యవేక్షణలో ఇతర అధికారులు, ఉద్యోగులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.

అంకితభావంతో శ్రీవారి సేవకుల సేవ‌లు

రథసప్తమిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి వాహన సేవలు వీక్షించేందుకు విచ్చేసిన ల‌క్ష‌లాది మంది భక్తులకు శ్రీవారి సేవకులు ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విశేషంగా సేవలందించారు.

దాదాపు 2 వేల మంది శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్యశాఖ, విజిలెన్స్‌ విభాగాలకు సంబంధించి మాడ వీధుల్లోని వివిధ ప్రాంతాలలో భక్తులకు సేవలందించారు. శుక్రవారం ఉదయం 4 గంటల నుండి నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న‌ భక్తులకు ఉదయం కాఫీ, పాలు, తాగునీరు, అల్పాహారం, మజ్జిగ, అన్నప్రసాదాలను భక్తిశ్రద్ధలతో పంపిణీ చేశారు. భక్తులు గ్యాలరీలలోనికి వచ్చేందుకు మాడ వీధులలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, గ్యాలరీలలోని ముఖ్యమైన ప్రాంతాలలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు టీటీడీ అధికారులకు, సిబ్బందికి సహకరించారు. తూర్పు మాడ వీధిలో 385 మంది, ప‌డ‌మ‌ర మాడ వీధిలో 495 మంది, ద‌క్షిణ మాడ వీధిలో 300 మంది, ఉత్త‌ర మాడ వీధిలో 590 మంది శ్రీ‌వారి సేవ‌కులు సేవ‌లందించారు.

అదేవిధంగా, మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, అక్ష‌య వంట‌శాల‌, పిఏసి-2లో శ్రీ‌వారిసేవ‌కులు ఆహార‌పొట్లాలు త‌యారుచేశారు. స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కూడా టీటీడీ విజిలెన్స్‌, పోలీస్‌ సిబ్బంది సహకారంతో తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లలో విధులు నిర్వహించారు. అన్ని విభాగాల్లో క‌లిపి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, ఒడిశా, ఢిల్లీ రాష్ట్రాల నుండి విచ్చేసిన దాదాపు 2,900 మంది శ్రీ‌వారి సేవ‌కులు భ‌క్తుల‌కు సేవ‌లందించారు. శ్రీవారి సేవకులు అందించిన సేవల పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేసి అభినందించారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.

SENIOR TTD OFFICIALS SUPERVISE RATHA SAPTHAMI FETE AT TIRUMALA

Tirumala,16 February 2024:  The grand Ratha Sapthami celebrations were successfully conducted by TTD under the supervision of senior officials and their staff making elaborate hassle free arrangements to the devotees on Friday upon the directions of TTD Chairman Sri Bhumana Karunakara Reddy and EO Sri AV Dharma Reddy.

The SVBC CEO Sri Shanmukh Kumar, CE Sri Nageswar Rao and FA&CAO Sri O Balaji supervised overall arrangements under the instructions of JEO Sri Veerabrahmam in Four Mada streets with support of sectoral officers, DFO Sri Srinivasulu on East, DyEO Sri Siva Prasad on West, EE Sri G V Krishna Reddy on South and Estates Special Officer Sri Mallikarjuna and DyEO Smt Prashanti on North Mada streets.

Srivari Sevakulu excelled in serving devotees in rendering Annaprasadam, Water distribution, vigilance services.

About 2000 Srivari Sevakulu were deployed for  Anna Prasadam, Health and Vigilance departments exclusively for four Mada streets from 4.00 am of Friday till 10pm, under the supervision of Chief PRO Dr Ravi and srivari seva office staff.

Similarly, Srivari Sevaks were deployed for preparing Annaprasadam packets at Vengamamba, PAC 2, Vaikuntham  Annaprasadam complexes etc.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI